ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎం కొత్త డ్రామాలు | Ramchander Rao Sensational Comments On Cm Revanth Reddy | Sakshi
Sakshi News home page

ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎం కొత్త డ్రామాలు

Jun 18 2026 5:33 AM | Updated on Jun 18 2026 5:33 AM

Ramchander Rao Sensational Comments On Cm Revanth Reddy

కిషన్‌రెడ్డిపై రేవంత్‌ ఆరోపణలు రాజకీయ నాటకం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు  

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభు­త్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు విమర్శించారు. గత రెండున్నరేళ్లలో ప్రధాని మోదీని పలుమార్లు కలిసిన సీఎం... కేంద్రమంత్రులను కలవడానికి అడ్డంకులు కల్పిస్తున్నా­రనడం హాస్యాస్పదమన్నారు. సీఎం మాటలు చెప్పడంలోనే కాకుండా...ఇప్పుడు అబద్ధాల ప్రచారంలోనూ ప్రా­వీ­ణ్యం సంపాదించారని ఎద్దేవా చేశారు. అబద్ధాన్ని పదే­పదే చెప్పి నిజమని నమ్మించేందుకు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, కేంద్ర ప్రభుత్వాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నా­రని, తమ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని దాచేందుకే రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మండి­పడ్డారు.

బుధవారం బీజేపీ కార్యాలయంలో రాంచందర్‌ రావు మీడియాతో మాట్లాడుతూ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని కోరుతూ కిషన్‌ రెడ్డికి సీఎం లేఖ రాయడం అత్యంత హాస్యాస్పద­మ­న్నా­రు. ఇప్పటివరకు సీఎం ఢిల్లీకి 71సార్లు వెళ్లారని, కనీసం 15సార్లు కేంద్రమంత్రులను కలిశారని గుర్తుచేశారు. ఆ సందర్భాల్లో ఎప్పుడైనా కిషన్‌రెడ్డికి చెప్పి కలిశారా? ఇప్పు­డు అపాయింట్‌మెంట్‌ ఇప్పించడం లేదంటూ కిషన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం బూటకమేనని మండిపడ్డా­రు. కేవ­లం ప్రజలను తప్పుదారి పట్టించేందుకే రేవంత్‌ రెడ్డి ఈ లేఖ రాశారని దుయ్యబట్టారు.

 కేంద్రమంత్రి కిష­న్‌రెడ్డిపై, బీజేపీపై నిరాధార ఆరోపణలు చేయడం వెంట­నే మాను­కో­వాలన్నారు. మెట్రో విస్తరణ ఆలస్యానికి కేంద్రం, కిషన్‌ రెడ్డి కారణం కాదని, కేవలం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ప్రధానకారణమని పేర్కొన్నారు. కాగా, సీని­యర్‌ సినీ ఆర్టిస్ట్‌ జ్యోతిరెడ్డి, నిర్మాత బండి శ్రీనివాస్‌ బీజేపీలో చేరడం పట్ల రాంచందర్‌రావు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement