చావునోట్లోంచి బయటపడ్డాడు.. | Railway Employee Escape From Accident In Warangal | Sakshi
Sakshi News home page

చావునోట్లోంచి బయటపడ్డాడు..

Aug 9 2021 8:16 PM | Updated on Aug 9 2021 8:16 PM

Railway Employee Escape From Accident In Warangal - Sakshi

సాక్షి, కాజీపేట (వరంగల్‌): కాజీపేట జంక్షన్‌లో ఆదివారం రాత్రి ఓ రైల్వే ఉద్యోగి రైలు కిందపడి ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. కాజీపేట జీఆర్‌పీ ఎస్సై అశోక్‌కుమార్, రైల్వే కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. డీజిల్‌ లోకోషెడ్‌లో పని చేస్తున్న శ్రీనివాస్‌ అనే రైల్వే కార్మికుడు ఎలక్ట్రిక్‌ లోకోషెడ్‌ సమీపంలో రైలు పట్టాలు దాడుతుండగా హైదరాబాద్‌–విశాఖపట్నం వెళ్లే ప్రత్యేక రైలు కింద పడడంతో ఇంజన్‌ ముందు భాగం క్యాటిల్‌ గార్డు పట్టాల మధ్య కంకర రాళ్లపై కొద్ది దూరం వరకు లాక్కెళ్లింది.

దీంతో రైలు డ్రైవర్‌ బ్రేక్‌ వేసి రైలును ఆపడంతో అక్కడే ఉన్న రైల్వే ఉద్యోగులు, ఆర్పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు గమనించి రైలు చక్రాలు, పట్టాల మధ్య చిక్కుకున్న రైల్వే కార్మికుడిని బయటికి తీశారు. అనంతరం రైలు వెళ్లింది. కాగా ఈ ఘటనలో కార్మికుడు స్వల్ప గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి  పీల్చుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement