PM Phone Call-Bandi Sanjay: బండి సంజయ్‌కు మోదీ ఫోన్‌.. ‘హౌ ఆర్యూ బండి..శభాష్‌’

PM Modi Calls Bandi Sanjay Lauds Him For Praja Sangrama Yatra 2 Success - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాసంగ్రామ యాత్ర–2, ముగింపు సభ విజయవంతం కావడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఆదివారం సంజయ్‌తో ఫోన్లో మాట్లాడిన మోదీ పాదయాత్రలో దృష్టికి వచ్చిన సమస్యలు, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలన తీరు, తదితర అంశాలపై ఆరా తీశారు. ‘హౌ ఆర్యూ బండి..శభాష్‌.. కష్టపడి పని చేస్తున్నారు.. ’ అంటూ మోదీ ఆత్మీయంగా పలకరించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

పాదయాత్ర చేసిన కార్యకర్తలకు, ప్రజా సంగ్రా మ సేన బృందానికి ప్రధాని ప్రత్యేక అభినందనలు తెలి పారు. కాగా ‘మీ స్ఫూర్తితో.. మీ సూచనలతోనే పాద యాత్ర చేపట్టాను.. రెండు విడతల్లో కలిపి 770 కి.మీ. నడిచాను’ అని మోదీకి సంజయ్‌ వివరించారు. కాగా ప్రధాని ఫోన్‌ కాల్‌ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపుతుందంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
చదవండి👇
పాస్‌పుస్తకంలో ‘పాట్‌ ఖరాబ్‌’ 

కల్తీ కనిపిస్తే ‘కాల్‌’చేయండి: హరీశ్‌

అమిత్‌ షా కాదు.. అబద్ధాలకు బాద్‌షా 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top