పదహారు రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు మృతి

Parents Died Due To Coronavirus - Sakshi

పదహారు రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు మృతి

మేడారం సమ్మక్క ప్రధాన పూజారి ఇంట్లో విషాదం

పిల్లల బాధ్యత తీసుకుంటామని వెల్లడించిన మంత్రులు 

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: వారు అభం, శుభం తెలియని చిన్నారులు.. ఒకరి వయసు ఐదేళ్లు, మరొకరికి మూడేళ్లు. పదహారు రోజుల వ్యవధిలోనే వారి తల్లి, తండ్రి ఇద్దరినీ కరోనా బలితీసుకుంది. ఈ విషయం చిన్నారులకు ఎలా చెప్పాలో తెలియక, వారి ఆలనా పాలనా ఏమిటని ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. ములుగు జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన మునీందర్‌ ఇంట్లో జరిగిన విషాదం ఇది.

ఒకరి వెంట ఒకరు..
మేడారం సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన మునీందర్‌ పెద్ద కుమారుడు సమ్మారావు (28). ఆయన కూడా జాతరలో  సమ్మక్క తల్లిని తీసుకొచ్చే క్రతువులో పాల్గొంటారు. సమ్మారావుకు భార్య సృజన (25), ఐదేళ్ల కుమారుడు జ్ఞానేశ్వర్, మూడేళ్ల కుమార్తె తేజస్విని ఉన్నారు. గత నెల 30న సమ్మారావు, సృజన ఇద్దరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారం పాటు ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ సమయంలో చిన్నారులిద్దరిని తాత మునీందర్, ఇతర బంధువులు చూసుకున్నారు. వారం తర్వాత తల్లిదండ్రులు ఇంటికి రావడంతో పిల్లల ముఖాల్లో వెలుగు వచ్చింది. అంతా బాగుందని అనుకునేలోపే మరో ఘోరం జరిగింది. ఇంటికొచ్చిన నాలుగైదు రోజులకే సృజనకు శ్వాస సమస్యలు తలెత్తాయి. ఆక్సిజన్‌ శాతం పడిపోవడంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

అక్కడే చికిత్స పొందుతూ ఈ నెల 11న కన్నుమూసింది. మృతదేహాన్ని మేడారం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. అమ్మ ఏదని పిల్లలు అడుగుతుంటే.. రేపు, ఎల్లుండి వస్తుందని చెబుతూ సమ్మారావు బాధను దిగమింగుకుంటూ వచ్చాడు. భార్య చనిపోయిన బాధలో ఉన్న సమ్మారావుకు కూడా మళ్లీ ఆరోగ్యం దెబ్బతిన్నది. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్‌ సోకడంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే పరిస్థితి విషమించి గురువారం కన్నుమూశాడు.

నాన్న నిద్రపోతున్నాడు.. అమ్మ ఏది?
సృజన చనిపోయి అంత్యక్రియలు చేసిన విషయం, సమ్మారావు చనిపోయిన విషయం వారి ఇద్దరు చిన్నారులకు తెలియదు. గురువారం సమ్మారావు మృతదేహాన్ని మేడారం తీసుకొచ్చి భార్య సమాధి పక్కనే ఖననం చేశారు. ఈ క్రమంలో తండ్రి మృతదేహాన్ని దూరం నుంచే పిల్లలకు చూపించగా.. ఆయన నిద్రపోతున్నాడని అనుకున్నారు. ‘‘నాన్న ఇంటికి వచ్చాడు.. మరి అమ్మ ఎప్పుడు వస్తుంది’’ అని వచ్చీరాని మాటలతో చుట్టూ ఉన్న పెద్దలను అడిగారు. ఇది చూసి అంతా కన్నీరు మున్నీరయ్యారు.

తల్లిదండ్రులు ఇద్దరూ లేరని పిల్లలకు ఎలా చెప్పాలంటూ బంధువులు గుండెలు బాదుకున్నారు. కాగా.. సమ్మారావు మృతిపై మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతాపం తెలిపారు. రోజుల వ్యవధిలోనే భార్యాభర్త మృతి చెందడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. పిల్లల బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించి ఆ కుటుంబానికి నిలుస్తుందని తెలిపారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

28-05-2021
May 28, 2021, 02:33 IST
ముత్తారం(మంథని): ‘బంగారాలు.. నానమ్మ, తాతయ్యల దగ్గర ఉండండి. అల్లరి చేయొద్దు. బయట తిరగొద్దు.. ’అంటూ అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలకు...
27-05-2021
May 27, 2021, 18:42 IST
లక్నో: భారతీయులకు వేదకాలం నుంచి గంగానదితో అనుబంధం పెనువేసుకుపోయింది. హిందువులు గంగానదిని ఎంతో పవిత్రంగా పూజిస్తారు. గంగాజలాన్ని చల్లుకుంటే పునీతులవుతారనేది ప్రధాన...
27-05-2021
May 27, 2021, 18:05 IST
హైదరాబాద్‌: ఓ వైపు కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ కూడా అదే రేంజ్‌లో ఉంది. అయితే ప్రభుత్వ...
27-05-2021
May 27, 2021, 14:35 IST
అచ్చు మా అమ్మలాంటి ఒకామె నా ఆటోలో కూచుని ఆక్సిజన్‌ పొంది బెడ్‌ కన్ఫర్మ్‌ అయ్యాక హాస్పిటల్‌లోకి వెళ్లింది
27-05-2021
May 27, 2021, 06:09 IST
కరోనాపై యుద్ధాన్ని గెలవడానికి, కోవిడ్‌ 19 నుంచి ప్రాణాలను రక్షించుకోవడానికి అత్యంత ముఖ్యమైన ఆయుధం టీకా అని ప్రధాని మోదీ...
27-05-2021
May 27, 2021, 06:02 IST
దేశంలో రోజువారీ కొత్త కరోనా పాజిటివ్‌ కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తున్నా.. రోజువారీ మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపించట్లేదు.
27-05-2021
May 27, 2021, 05:36 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)...
27-05-2021
May 27, 2021, 04:59 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ బాధితులకు ఆరోగ్యశ్రీ కొండంత అండగా నిలుస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా కోవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో...
27-05-2021
May 27, 2021, 04:34 IST
కాకినాడ సిటీ: కరోనా కారణంగా తల్లిదండ్రులు మరణించిన చిన్నారుల పేరిట రూ.10 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసే కార్యక్రమం తూర్పు...
27-05-2021
May 27, 2021, 04:11 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సీఎం సహాయనిధికి కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ రూ.2 కోట్ల విరాళం ఇచ్చింది....
27-05-2021
May 27, 2021, 03:01 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ విపత్తు వేళ డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్విరామంగా అందిస్తున్నసేవలకు ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...
27-05-2021
May 27, 2021, 02:51 IST
నా నుంచి మీదాకా.. ఒకటే ‘‘రెండో డోస్‌ టీకా కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రాధాన్యం ఇస్తాం. వ్యాక్సిన్‌ విషయంలో నా...
27-05-2021
May 27, 2021, 02:47 IST
గీసుకొండ: కరోనా రక్కసి ఓ కుటుంబంలో కల్లోలం సృష్టించింది. ఓ వ్యక్తి ఏకంగా రూ.46 లక్షలు ఖర్చు చేసినా.. ప్రాణాలు...
27-05-2021
May 27, 2021, 01:28 IST
ఈ కోవిడ్‌ సంక్షోభంలో ఆక్సిజన్‌ కొరత వల్ల పలువురు కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో...
27-05-2021
May 27, 2021, 01:14 IST
ఒక అబ్బాయికి ఆక్సిజన్‌ సిలిండర్‌ పంపిస్తే అది ఇంటికి చేరేలోపు చనిపోయాడు. ఇలా చివరి నిమిషాల్లో రిక్వెస్ట్‌లు పెట్టడం వల్ల...
27-05-2021
May 27, 2021, 00:59 IST
లండన్‌: కరోనా వైరస్‌ ప్రధాన లక్ష్యం మనిషి ఊపిరితిత్తులే. ఈ వైరస్‌ వల్ల చనిపోతున్న వారిలో ఎక్కువ మందికి ఊపిరితిత్తులకు...
27-05-2021
May 27, 2021, 00:11 IST
న్యూఢిల్లీ: భారత్‌లో ఇండోనేసియా రాయబారి ఫెర్డీ నికో యోహానెస్‌ పయ్‌ మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన గత నెలలో కరోనా...
26-05-2021
May 26, 2021, 17:40 IST
ఢిల్లీ: రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు  ఢిల్లీ ప్రభుత్వం పావులు కదుపుతుంది. ఇందులో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ను...
26-05-2021
May 26, 2021, 14:51 IST
జైపూర్‌: కోవిడ్‌ దేశంలోని ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగులుస్తోంది. ఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడి వందల కొద్దీ ప్రాణాలు...
26-05-2021
May 26, 2021, 14:04 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్న తర్వాత అనేకమంది బాధితుల్లో బ్లాక్ ఫంగస్ మహమ్మారి బయటపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top