వైరస్‌కు శక్తి పెరిగింది.. ఎయిర్‌ బోర్న్‌గా రూపాంతరం చెందింది

NIT Warangal Assistant‌ Professor Comments On Corona Pandemic - Sakshi

కరోనాపై నిట్‌లో పరిశోధనలు

సాక్షి, కాజీపేట అర్బన్‌: కోవిడ్‌–19పై వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేటలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లో చేపట్టిన పరిశోధనలు ఏడాది పూర్తి చేసుకున్నాయి. నిట్‌లోని డీబీటీ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ) ద్వారా రూ.రెండు కోట్ల నిధులతో కరోనా వైరస్‌పై మూడేళ్ల కాలపరిమితితో పరిశోధనలు చేపట్టారు. గతేడాది మేలో శ్రీకారం చుట్టారు. బయోటెక్నాలజీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ పెరుగు శ్యాం, గిరీష్‌ ఈ పరిశోధనల్లో పాలు పంచుకుంటున్నారు.

ఈ సందర్భంగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ కరోనా వైరస్‌ ఎయిర్‌ బోర్న్‌గా రూపాంతరం చెందిందని తెలిపారు. వ్యక్తులు తుమ్మినా, దగ్గినా తుంపరలు గాలిలో కలసిపోయి ఆరు మీటర్ల పరిధి వరకు వెళ్లే శక్తి వైరస్‌కు పెరిగినట్లు  చెప్పారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నుంచి థర్డ్‌ వేవ్‌ను అందుకునే దిశగా పయనిస్తోందని తెలిపారు. రెండేళ్లలో కరోనా సెకండ్‌ వేవ్, థర్డ్‌ వేవ్‌పై పరిశోధనలు చేస్తున్నామని శ్యాం, గిరీష్‌ వివరించారు. 

చదవండి: (తెలంగాణలో రెండు వారాల్లో లక్ష కేసులు)

Election 2024

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top