పోలీసుల కస్టడీకి కార్వీ ఎండీ పార్థసారథి.. నాంపల్లి కోర్టు అనుమతి

Nampally Court Allows Two Days Custody To Police For Karvy Md Parthasarathi - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: బ్యాంకు రుణాల ఎగవేత, నిధుల మళ్లింపుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ ఎండీ పార్ధసారథిని పోలీస్‌ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. న్యాయస్థానం అనుమతి మేరకు రెండు రోజుల పాటు సీసీఎస్ పోలీసులు పార్థసారథిని విచారించనున్నారు. ప్రస్తుతం పార్థసారథి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో వున్నారు.

కాగా రూ.780 కోట్ల రుణాల ఎగవేత కేసులో సీసీఎస్‌ పోలీసులు ఆగస్టు 19న అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివిధ బ్యాంకుల ఫిర్యాదుతో సీసీఎస్‌ పోలీసులు చర్యలు తీసుకున్నారు. కార్వీ షేర్లను తనఖా పెట్టి వివిధ బ్యాంకుల వద్ద పార్థసారధి రుణాలు స్వీకరించారు. హెచ్‌డీఎఫ్‌సీలో రూ.340 కోట్లు, ఇండస్ ఇండ్‌ బ్యాంక్‌లో రూ.137 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీలో మరో రూ.7 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ రుణాలను అక్రమంగా వినియోగించుకున్నారని బ్యాంకులు ఫిర్యాదు చేశాయి. 

చదవండి:Telangana Schools Reopen: ఆన్‌లైన్‌ కాదు.. అందరూ రావాల్సిందే

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top