పావు గంట సేపు కొట్లాట.. స్థానికుల బెంబేలు
వరంగల్‌లోని 14వ డివిజన్ న్యూ లక్ష్మీ గణపతి కాలనీలో శనివారం ఉదయం ఇళ్ల నడుమ కోతులు, కుక్కల గుంపు కాళ్లు దువ్వుకున్నాయి. పదుల సంఖ్యలో చేరిన ఇరు జాతులు కొట్లాటకు దిగాయి. సుమారు పావుగంటపాటు వీటి ఆగ్రహావేశాలను చూసిన స్థానికులు ఇళ్లకు తలుపులు బిగించుకున్నారు. వీటి బారిన పడి మనుషులు గాయాలపాలవుతున్నా కార్పొరేషన్ అధికారులు కనికరం చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తల్లడిల్లిన గోమాత
ప్లాస్టిక్ వ్యర్థాలు తినడంతో రెండు గంటలు నరకయాతన
హనుమకొండ బస్టాండ్ సమీపంలో ఓ సూడి ఆవు రెండు గంటలు నరకయాతన పడింది. ఆ బాధ చూడలేక ఓ సెక్యూరిటీ గార్డు డయల్ 100కు ఫోన్ చేశాడు. సలహా ఇచ్చారే కానీ, ఎవరూ స్పందించలేదు. చివరికి తెలిసిన వారి నుంచి మడికొండ వెటర్నరీ అసిస్టెంట్ రమేశ్‌కు సమాచారం ఇవ్వగా.. ఆయన çఘటనా స్థలానికి చేరుకున్నాడు. ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల అజీర్తితో బాధపడుతున్నట్లు గు ర్తించి వైద్యం అందించాడు. కాగా, ఏప్రిల్ 25న పశు వైద్యుల దినోత్సవం.. హనుమకొండ పరిధి పశు వైద్యులకు ఫోన్ చేసినా స్పందించలేదని పలువురు వాహనదారులు చెప్పడం గమనార్హం.
– హన్మకొండ చౌరస్తా


