అంబులెన్స్‌లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

సాక్షి, హైదరాబాద్ : మంత్రి తారక రామారావు జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ప్రజల కోసం ఉచితంగా అంబులెన్సులను అందించే కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. ఈ మేరకు నేడు(సోమవారం) ప్రగతిభవన్‌లో 19 అంబులెన్సులను వివిధ జిల్లాలకు పంపించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా డొనేట్ చేసిన ఈ అంబులెన్సులను మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. చదవండి: బీజేపీవి చిల్లర ప్రయత్నాలు
మంత్రి గంగుల కమలాకర్ రెండు, మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఒక్కో అంబులెన్స్ చొప్పున అంది ఇవ్వగా,ఎమ్మెల్సీలు నవీన్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితోపాటు పలువురు నేతలు వాసిలి చంద్రశేఖర ప్రసాద్, ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, ఎంపీ కవిత మాలోత్, ఎమ్మెల్యే సంజయ్, నడిపల్లి వెంకటరావు, వంశీ కేతినేని, ఎమ్మెల్యే జోగు రామన్న, ఎలిగంట్ సేల్స్ అండ్ మార్కెటింగ్‌కు చెందిన శ్రీనాథ్, పలువురు అంబులెన్సులను అందించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి