మంత్రి అడ్లూరికి తప్పిన ముప్పు | Minister Adluri Laxman Kumar narrowly escapes Lift acciden | Sakshi
Sakshi News home page

మంత్రి అడ్లూరికి తప్పిన ముప్పు

Oct 12 2026 5:12 AM | Updated on Oct 12 2026 5:12 AM

Minister Adluri Laxman Kumar narrowly escapes Lift acciden

ప్రమాదానికి కారణమైన లిఫ్ట్‌

ప్రైవేటు కార్యక్రమంలో పడిపోయిన లిఫ్ట్‌

జగిత్యాల రూరల్‌: సంక్షేమ శాఖ మంత్రి అడ్లూ­రి లక్ష్మణ్‌కుమార్‌కు జగిత్యాల జిల్లాకేంద్రంలో లిఫ్ట్‌ ప్రమాదం తృటిలో తప్పింది. గతంలో కరీంనగర్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో లిఫ్ట్‌ ప్రమాదంలో స్వల్పంగా గాయపడటం తెలిసిందే. తాజాగా ఆయన ఆదివారం జగిత్యాల అర్బ­న్‌ మండలం ధరూర్‌లోని ఓ ప్రైవేటు కార్య­క్రమానికి హాజరై ముందుగా లిఫ్ట్‌లో వెళ్లారు. 

మంత్రి వెళ్లిన తర్వాత ఆయన అనుచరులు, గన్‌మెన్‌లు లిఫ్ట్‌లో వెళ్తుండగా ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ ఘటనలో ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు ముఖేశ్‌ఖన్నాకు స్వల్ప గాయాల­య్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది అత­న్ని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ము­ఖేశ్‌ను డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. మంత్రి అడ్లూ­రికి ఇప్పటికే రెండుసార్లు లిఫ్ట్‌ ప్రమాదాలు తప్పాయి. ఒకసారి కారు బోల్తాపడిన ప్రమా­దంలోనూ తృటిలో తప్పించుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement