వంద బిలియన్‌ డాలర్ల పరిశ్రమగా లైఫ్‌ సైన్సెస్‌ 

KTR Announced Life Sciences Will Improvised By 100 Million Dollars - Sakshi

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ 

లైఫ్‌ సైన్సెస్‌కు నూతన సలహా కమిటీ నియామకం 

సాక్షి, హైదరాబాద్ ‌: లైఫ్‌ సైన్సెస్‌ రంగాన్ని వచ్చే దశాబ్దకాలంలో వంద బిలియన్‌ డాలర్ల పరిశ్రమగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. రెండేళ్ల కాల పరిమితితో కూడిన లైఫ్‌ సైన్సెస్‌ సలహా నూతన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ లైఫ్‌ సైన్సెస్‌ సలహా కమిటీ తొలి సమావేశానికి మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

2016లో నియమించిన కమిటీ కాల పరిమితి ముగియడంతో పరిశ్రమల శాఖ అధికారులు, ఫార్మా, బయో టెక్నాలజీ, వైద్య ఉపకరణాలు, డిజిటల్‌ హెల్త్‌ రంగాలకు చెందిన ప్రముఖులతో అధికారులు ఈ కొత్త కమిటీ ఏర్పాటుచేశారు. డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌కు చెందిన సతీష్‌రెడ్డి చైర్మన్‌గా, ‘బయోలాజికల్‌ ఈ’ఎండీ మహిమా దాట్ల వైస్‌ చైర్మన్‌గా, లైఫ్‌ సైన్సెస్‌ విభాగం డైరెక్టర్‌ను కన్వీనర్‌గా నియమిస్తూ కొత్త కమిటీ ఏర్పాటైంది. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థల నడుమ ఈ కమిటీ సంధానకర్తగా పనిచేయనుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top