ఆలుమగల బంధానికి అర్థం చెప్పారు.. ‘ఇదీ బంధమంటే..!’

Kamareddy Bikkanur Old People Heart Warming Photo Viral - Sakshi

కామారెడ్డి: వృద్ధాప్యం శరీరానికే. మనసుకు కాదు. పరస్పరం అవగాహన, స్నేహంగా సాగితే ఆ బంధం పునాదులు చెదరవు. ఈ చిత్రం భార్యాభర్తల అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తుంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాలకు చెందిన దంపతులు మాద్యం పోచమ్మ, గంగారాం బతుకమ్మ పండుగ కోసం భిక్కనూరులోని కుమార్తె గడ్డం మణెమ్మ ఇంటికి వచ్చారు.

సాయంత్రం వేళ పోచమ్మ కాలిగోర్లు తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే, నేనున్నా కదా! అంటూ భార్యకు గోర్లు తీస్తూ గంగారాం ఇలా కనిపించాడు. క్షణికావేశంతో తీక్షణ నిర్ణయాలు తీసుకునే యువ జంటలు ఆలోచన చేయాలనే సందేశానికి వారు ప్రతిరూపంగా నిలిచారు.  – భిక్కనూరు   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top