7న మేడిగడ్డకు జస్టిస్‌ చంద్రఘోష్‌! | Sakshi
Sakshi News home page

7న మేడిగడ్డకు జస్టిస్‌ చంద్రఘోష్‌!

Published Sun, May 5 2024 3:23 AM

Justice Chandraghosh to Medigadda on 7th

ఈ నెల 6–12 తేదీల మధ్య రాష్ట్రంలో పర్యటించనున్న ఎంక్వైరీ కమిషన్‌

వీలైతే 8న అన్నారం బ్యారేజీకి వెళ్లే అవకాశం

9న అధికారులతో సమావేశాలు

12న తిరిగి కోల్‌కతాకు జస్టిస్‌ చంద్రఘోష్‌ 

సాక్షి, హైదరాబాద్‌: జస్టిస్‌ పీసీ చంద్రఘోష్‌ కమిషన్‌ ఈ నెల 7న మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనుంది. గతేడాది అక్టోబర్‌ 21న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌ కుంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులోని లోపాలపై విచారణకోసం ఏర్పాటైన జస్టిస్‌ చంద్రఘోష్‌ కమిషన్‌ ఈ నెల 6 నుంచి 12 వరకు రాష్ట్రంలో రెండో విడత పర్యటన నిర్వహించనుంది. 6న హైదరాబాద్‌కు చేరుకుని సాయంత్రం 5 గంటలకు బీఆర్‌కేఆర్‌ భవన్‌లోని తన కార్యాలయంలో జస్టిస్‌ చంద్రఘోష్, నీటిపారుదల శాఖ కార్యదర్శితో సమావేశం కానున్నారు. 

మరుసటి రోజు ఉదయం మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరనున్నారు. బ్యారేజీని పరిశీలించిన అనంతరం ఆయన రాత్రి రామగుండంలో బస చేస్తారు. మేడిగడ్డ బ్యారేజీకి మాత్రమే భారీ నష్టం జరగడంతో ప్రస్తుతానికి ఈ బ్యారేజీని మాత్రమే సందర్శించాలని జస్టిస్‌ చంద్రఘోష్‌ నిర్ణయించారు. 8న ఉదయం ఆయన రామగుండం నుంచి బయలుదేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు. వీలైతే దగ్గరల్లో ఉన్న అన్నారం బ్యారేజీని తొలుత సందర్శించి తర్వాత హైదరాబాద్‌కు చేరుకునే అవకాశాలున్నాయి. 

9న ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై న్యాయవిచారణలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలను చర్చిస్తారు. బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాల్లో భాగస్వాములైన అధికారులు, ప్రజాప్రతినిధులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేసే అంశంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 10, 11 తేదీలను జస్టిస్‌ పీసీ చంద్రఘోష్‌ రిజర్వ్‌ చేశారు.

 12న ఆయన తిరిగి కోల్‌కతాకు బయలు దేరి వెళ్లనున్నారు. మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్, డిజైనింగ్, నిర్మాణంలో చోటుచేసు కున్న నిర్లక్ష్యం, అక్రమాలు, లోపా లు, అవినీతి, ప్రజాధనం దుర్విని యోగంపై న్యాయ విచారణ జరప డానికి సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయ మూర్తి జస్టిస్‌ పీసీ చంద్రఘోష్‌ను కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
 
Advertisement