డీఆర్‌డీఎల్‌ డైరెక్టర్‌గా శ్రీనివాసమూర్తి 

Hyderabad: Srinivasa Murthy Appointed New Director Of DRDL - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ లాబొరేటరీ (డీఆర్‌డీఎల్‌) డైరెక్టర్‌గా ప్రముఖ శాస్త్రవేత్త జి.ఎ.శ్రీనివాస మూర్తి నియమితులయ్యారు. డాక్టర్‌ దశరథ్‌ రామ్‌ ఉద్యోగ విరమణ తరువాత ఆయన స్థానంలో డైరెక్టర్‌ అండ్‌ డీఎస్‌గా జి.ఎ.శ్రీనివాసమూర్తిని నియమించారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన డీఆర్‌డీవో అనుబంధ సంస్థ డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ మిస్సైల్‌ కాంప్లెక్స్‌ (రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌)లో డీఆర్‌డీఎల్‌ ఒక భాగమన్న విషయం తెలిసిందే.

డైరెక్టర్‌గా నియమితులయ్యే ముందు వరకూ జి.ఎ.శ్రీనివాస మూర్తి అడ్వాన్స్‌డ్‌ నావల్‌ సిస్టమ్స్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసమూర్తి 1986లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌లో బీఈ విద్యను అభ్యసించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఈ (1997) పట్టా పొందారు. 1987లోనే డీఆర్‌డీఎల్‌లో చేరిన ఆయన స్ట్రక్చరల్‌ డైనమిక్స్, గ్రౌండ్‌ రెజొనెన్స్‌ టెస్టింగ్, ఎలక్ట్రికల్‌ ఇంటిగ్రేషన్‌ వంటి అంశాల్లో కృషి చేశారు. మిస్సైల్‌ కాంప్లెక్స్‌ చేపట్టిన పలు ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top