గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ కీలక భేటీ | Hyderabad: Congress Party Meeting In Gandhi Bhavan | Sakshi
Sakshi News home page

గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ కీలక భేటీ

Jul 23 2023 7:44 PM | Updated on Jul 23 2023 9:00 PM

Hyderabad: Congress Party Meeting In Gandhi Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ గెలుపు కోసం నేతలు వ్యూహ రచనలో బిజీబిజీగా గడుపుతున్నారు. కర్ణాటకలో విజయం సాధించి కాంగ్రెస్‌ పార్టీ మంచి ఊపు మీదున్న సంగతి తెలిసిందే. అదే జోరు, జోష్‌ను తెలంగాణలో చూపించి ఈ సారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని హస్తం నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆదివారం గాంధీభవన్‌​లో పీఏసీ సమావేశమైంది. మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, జానా రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ ప్రియాంక సభ, బస్సు యాత్ర, ఎన్నికల సభలు, సామాజిక వర్గాల వారీగా డిక్లరేషన్లు, మేనిఫెస్టో, తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.

చదవండి   తాడో పేడో తేల్చుకుంటాం.. గాంధీభవన్‌లో పొన్నం అనుచరుల ఆందోళన

Advertisement
 
Advertisement
Advertisement