భార్య, కుమారుడి గొంతు కోసి భర్త ఆత్మహత్యాయత్నం

Husband Commits To End Life And Slitting Wife And Son Throat In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: వరంగల్‌లోని పెద్దమ్మగడ్డ కాకతీయ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్య, కుమారుడి గొంతు కోసి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు ముగ్గురిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వివారాల్లోకి వెళ్తే.. పెద్దమ్మగడ్డ కాకతీయ కాలనీ చెందిన ప్రైవేట్ ఉద్యోగి జయవర్ధన్ చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక చివరకు తన కుటుంబాన్ని అంతమొందించుకోవాలకున్నాడు.

భార్యను, కొడుకు గొంతు కోసి ఆపై తాను గొంతు కోసుకున్నాడు. ఇంతలో అతడి ఏడేళ్ల కుమార్తె భయంతో పరుగులు తీసి పక్కింటివారికి చెప్పడంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. జయవర్ధన్ లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై చేసిన అప్పులు తీర్చలేక భార్య, కుమారుడి గొంతు కోసి తాను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడని పోలీసులు పేర్కొన్నారు. బాధితులను ఆరోగ్య పరిస్థితి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top