How To Apply Voter ID Card: మేలుకో.. ఓటు నమోదు చేసుకో

Hot To Apply Online For Voter ID Card In Telugu - Sakshi

1 నుంచి ప్రారంభమైన నమోదు ప్రక్రియ

18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ అర్హులే..

ఆన్‌లైన్‌లో వచ్చే నెల 15 వరకు దరఖాస్తుల స్వీకరణ 

సాక్షి, హైదరాబాద్‌ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఓటు హక్కుకు యువత దూరమైతే ప్రజాస్వామ్యానికి సరైన న్యాయం జరగదు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కల్పించాలన్న లక్ష్యంతో  ఈ నెల 1 నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారభమైంది. ఈ మేరకు భారత ఎన్నికల కమిషన్‌ ఓటు నమోదులో మార్పులు, చేర్పులతో పాట సవరణలకు అవకాశం కల్పిస్తూ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కొత్త ఓటర్ల నమోదుకు వీలు కల్పిస్తూ ఓటర్ల జాబితా స్పెషల్‌ డ్రైవ్‌ ప్రారంభించింది. 2022 జనవరి 1 వతేదీ నాటికి 18 ఏళ్ళు నిండిన యువత తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అదేవిధంగా గతంలో ఓటు హక్కు పొందలేకపోయినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. తుది ఓటర్ల జాబితా ప్రకటించే ముందు ఈ నెల 6, 7, 27, 28 వ తేదీలలో డిసెంబర్‌లో రెండు రోజుల పాటు అధికారులు ఓటు నమోదుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. కొత్తగా ఓటరు నమోదుతో పాటు మార్పులు, చేర్పులు, తొలగింపులు, అభ్యంతరాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రంగారెడ్డి మాడ్గుల మండలంలోని 33 గ్రామపంచాయతీలలో 35,245 మంది ప్రస్తుత ఓటర్లు ఉండగా, అందులో 18,738 మంది పురుష ఓటర్లు, 16,500 మహిళ ఓటర్లు, 7 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. మండలంలో గ్రామాల్లో 50 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి పోలింగ్‌  పరిధిలో బీఎల్‌ఓలు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉండి దరఖాస్తులు స్వీకరిస్తారు. 
చదవండి: ‘దొంగ’ తెలివి.. అమ్మవారికి మొక్కి పని కానిచ్చేశాడు.. వైరలైన దృశ్యాలు

నేరుగా వెళ్లి నమోదు..  
ఓటరు నమోదు, మార్పుల, చేర్పులు, అభ్యంతరాలపై పోలింగ్‌ కేంద్రాల వద్ద బీఎల్‌ఓలు, గ్రామపంచాయతీలు, తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పంచాయతీల్లో ఓటరు జాబితా సిద్ధంగా ఉంచారు.  పేర్లు ఉన్నాయో లేవో చూసుకుని వెంటనే నమోదు చేసుకోవచ్చు. జాబితాలో అభ్యంతరాలుంటే తెలపవచ్చు. మరణించిన వారి పేరు జాబితాలో ఉంటే, ఇతర ప్రాంతాల్లో  నమోదై ఉన్నట్లు ఆధారాలుంటే ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు.  తాను కోరుకున్న చోటుకు తమ పేరు బదిలీ చేసుకునే అవకాశం ఉంది. 

ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఇలా.. 
డిసెంబర్‌ 15వ తేదీ లోపు ఓటరుగా ఆన్‌లైన్లో దరఖాస్తు నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోదల్చినవారు ముందుగా ఠీఠీఠీ.ఛ్ఛి్టౌ్ఛl్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్‌సైట్‌లోకి వెళ్లి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు స్కాన్‌ చేసి ఆప్‌లోడ్‌ చేయాలి. వీటిని సంబం«ధిత అధికారులు పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే 2022 జనవరి 15 న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు.

ఈ ధ్రువపత్రాలు తప్పనిసరి 
పేరు నమోదు చేసుకునే వారు వయస్సు నిర్ధారణ పత్రాలు తీసుకెళ్లాలి. విద్యాసంస్థ జారీ చేసిన బోనఫైడ్‌ సర్టిఫికెట్‌ లేదా ఆధార్‌కార్డు ఉండాలి. దరఖాస్తు ఫారాలను పూరించి ధ్రువీకరణ పత్రాల నకళ్లు జతచేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

యువత సద్వినియోగం చేసుకోవాలి 
మండలంలోని 50 పోలింగ్‌ కేంద్రాలకు బీఎల్‌ఓలను నియమించాం. వారు ప్రతి పోలింగ్‌బూత్‌లో అందుబాటులో ఉంటారు. నూతన ఓటర్ల నమోదు, సవరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మార్పులు, చేర్పులు ఉంటే ఆన్‌లైన్‌ ద్వారా దరఖాçస్తు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఓటు హక్కు ప్రాముఖ్యత గుర్తించాలి.  18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు నమోదుకోసం తమతమ పేర్లు నమోదు చేసుకోవాలి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top