
హైదరాబాద్: నగరంలో మళ్లీ భారీ వర్షం పడుతోంది. నిన్న(గురువారం, జూలై 17) సాయంత్రం సమయంలో హైదరాబాద్‌నలో భారీ వర్షం పడగా, ఈరోజు(శుక్రవారం, జూలై 18) కూడా పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కీకారణ్యంగా మారిపోయిన మేఘాలు.. కాసేపటికి భారీ వర్షంతో నగరాన్ని తడిపేశాయి.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయతనగర్‌లో కుండపోత వర్షం పడుతుండగా, ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లిలో సైతం భారీ వర్షం కురుస్తోంది. ఇక మెహదీపటం‍్నం, అత్తాపూర్, రాజేంద్రనగర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటిలో కుండపోత వర్షం పడుతోంది. నాచారం, హబ్సిగూడ్, తార్నాక తదితర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. నగరంలో పలుచోట్ల భారీ వర్షం పడుతూ ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు. బంజారాహిల్స్, పంజాగుట్టలోట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు అవస్థులు పడుతున్నారు.
