రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం దసరా శుభాకాంక్షలు 

Governor Tamilisai Soundararajan And CM KCR Extend Dasara Greetings - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దసరా పండుగ సందర్భంగా రాష్ట్రప్రజలకు గవర్నర్‌ డా.తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దసరా పండుగను ప్రజలు జరుపుకుంటున్నారని గవర్నర్‌ పేర్కొన్నారు. మనమంతా కలసి వ్యాధులకు కారణమయ్యే వైరస్, పర్యావరణ విపత్తులు వంటి దుష్టశక్తులపై పోరాడాలని డా.తమిళిసై పిలుపునిచ్చారు.

తెలంగాణకు దసరా ఓ ప్రత్యేక వేడుక అని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకూడదనే స్ఫూర్తితో, చెడు మీద మంచి విజయానికి సంకేతంగా విజయదశమిని జరుపుకుంటారని ఆయన తెలిపారు. ఆయురారోగ్యాలు సిరి సంపదలతో జీవించేలా తెలంగాణ ప్రజలను దీవించాలని దుర్గామాతను దసరా సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రార్థించారు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top