హైదరాబాద్: గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 40వ వార్షికోత్సవాలు బుధవారం మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో అట్టహాసంగా జరిగాయి. గీతాంజలి స్కూల్స్ పూర్వ విద్యార్థి అయిన ఎంపీ వంశీకృష్ణ ఈ వేడుకలకు చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ తన స్కూల్ డేస్‌ను గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొత్తగా సాధించాలనే పట్టుదల, తపన, క్రియేటివిటీ కలిగి ఉండాలన్నారు.
ఉద్యోగాలు చేయడమే కాకుండా సృష్టించేలా కూడా ఎదగాలన్నారు. సొసైటీ డెవలప్‌మెంట్‌కోసం పాటుపడుతూ, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకువాలని కోరారు. తెలంగాణ నుంచి నేషనల్ అవార్డ్ దక్కించుకున్న స్కూల్ ఫౌండర్, ప్రిన్సిపాల్ గీతా కరణ్ గత 40 ఏళ్లుగా గీతాంజలి విద్యా సంస్థల ద్వారా సోషల్ సర్వీస్ చేస్తూ, గొప్ప విద్యార్థులను సమాజానికి అందిస్తున్నారని కొనియాడారు. వార్షికోత్సవం సందర్భంగా తమ స్కూల్ పూర్వ విద్యార్థి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాజరుకావడం ఆందంగా ఉందని గీతా కరణ్ అన్నారు.
అనంతరం వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఫ్యాషన్ షో, డాన్స్ లతో విద్యార్థులు అలరించారు. తర్వాత విద్యా సంస్థల టీచర్స్ సేవలను గుర్తించి అవార్డులను అందించారు. కార్యక్రమంలో స్కూల్ ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు.


