డోకొచ్చేలా.. కేకులు | Food Safety Officials Raids On Bakery | Sakshi
Sakshi News home page

డోకొచ్చేలా.. కేకులు

Jan 5 2025 8:37 AM | Updated on Jan 5 2025 8:37 AM

Food Safety Officials Raids On Bakery

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెల్లడి  

సాక్షి, సిటీబ్యూరో: ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఎక్కడ తనిఖీలు చేసినా కల్తీ, అపరిశుభ్రత, బొద్దింకలు, ఎలుకల సంచారం, ఇతరత్రా పలు అవాంఛనీయ పరిస్థితులే కనిపిస్తున్నాయి. హోటళ్లు, స్వీట్‌ షాపులు, చికెన్‌ మార్కెట్లతో పాటు ఆఖరికి కేకుల దుకాణాల్లోనూ డోకొచ్చే పరిస్థితులే కనిపించాయి. సికింద్రాబాద్‌ జోన్‌లోని అల్వాల్, కార్ఖానా ప్రాంతాల్లో  ఫుడ్‌సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో లోపాలు బయల్పడ్డాయి. అల్వాల్‌లోని మచ్చ»ొల్లారం మాంగినీస్‌ కేక్‌ షాప్‌లో కేకుల తయారీ ప్రాంతాల్లో గుంపుగా సంచరిస్తున్న  బొద్దింకలు, స్టోరేజీ ప్రాంతాల్లో ఎలుకల పెంటికలు దర్శనమిచ్చాయి. 

కేకుల తయారీకి వినియోగించే పాత్రలు అపరిశుభ్రంగా ఉన్నాయి. కోల్డ్‌ రూమ్‌లోని ఏసీ లీకేజీతో గదిలోని ట్రేలలో ఉన్న ఆహార పదార్థాలు కలుషి తమయ్యే పరిస్థితులు కనిపించాయి. కేసర్‌ సిరప్, పైనాపిల్, వెనీలా ఫ్లేవర్లు, ఇతరత్రా పదార్థాలు గడువు ముగిసిపోవడం  గుర్తించారు. పలు ఆహార పదార్థాలు ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో అపరిశుభ్రంగా కనిపించాయి. రవాణాకు వినియోగించే ఏడు చిల్లర్‌ వాహనాలకు లైసెన్సుల్లేవు. ఇక సిబ్బంది ఆరోగ్య పరీక్షల వివరాలు, శిక్షణ పొందిన సరి్టఫికెట్లు లేవు.  కార్ఖానాలోని వాక్స్‌ పేస్ట్రీస్‌ (బేకరీ)లోనూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. సిబ్బంది వైద్య పరీక్షల రిపోర్డుల్లేవు. 

కేకుల తయారీలో ఆల్కహాల్‌..  
ఎక్సైజ్‌ అనుమతి లేకుండా ప్లమ్‌ కేక్‌ తయారీలో ఆల్కహాల్‌ (రమ్‌) వినియోగిస్తుండటం  కనిపించింది. కేకుల డబ్బాలపైనా ఆల్కహాల్‌ వినియోగించినట్లు వివరాల్లేవు. వంట పాత్రలు  అధ్వానంగా ఉన్నాయి. కేకుల తయారీలో వినియోగించేందుకు భారీ మొత్తంలో తయారు చేసిన  డ్రైఫ్రూట్స్, జామ్‌ మిక్స్‌ల పల్ప్‌ను ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో నిల్వ చేశారు. దీన్ని ఆర్నెల్ల వరకు వినియోగించవచ్చని నిర్వాహకులు చెప్పినప్పటికీ ఎప్పుడు తయారు చేసింది, ఎప్పటిలోగా వినియోగించవచ్చో వివరాల్లేవు. బేకరీలో తయారు చేసిన ప్లమ్‌కేక్స్, బిస్కెట్లు, బ్రెడ్, తదితర ఆహార పదార్థాల ప్యాకెట్ల లేబుల్స్‌పై ప్రదర్శించాల్సిన సమాచారం లేదు. 

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్సు, తయారీ కేంద్రం చిరునామా, వెజ్‌/నాన్‌వెజ్‌ లోగో వంటివి లేవు. తయారీలో వినియోగించిన పదార్థాలు, వాటి పోషక విలువలు, బ్యాచ్‌నెంబర్‌ వంటి వివరాల్లేవు. ఆహార పదార్థాలు, కెమికల్స్‌ వంటి పదార్థాలు, సగం వండిన వెజ్, నాన్‌వెజ్‌ పదార్థాలు కలగలిపి నిల్వ చేశారు. ఫ్రిజ్‌లలోని కొన్ని పదార్థాలకు మూతలు లేవు, లేబుల్స్‌ లేవు. తగిన టెంపరేచర్‌తో నిర్వహించడం లేదు. ఇలా పలు లొసుగులు బయటపడ్డాయి. శుక్రవారం తనిఖీలు నిర్వహించిన  ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఈ వివరాల్ని శనివారం ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.  

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెల్లడి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement