
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన నిరుద్యోగులు ఏడేళ్లుగా నిరా శ, నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. సీఎం కేసీఆర్‌లో చలనం రావడం లేదని, ఇంకా ఎం తమంది నిరుద్యోగుల ఉసురు పోసుకుంటారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మం డిపడ్డారు. ఉద్యోగ ప్రకటన వేయలేదని ఈనెల 25న ఆత్మహత్య చేసుకున్న ముత్యాల సాగర్ స్వగ్రామం బయ్యారం గ్రామంలో తల్లి దండ్రులు భద్రయ్య, కళమ్మ లను శుక్రవారం ఈటల పరా మర్శించారు. సాగర్ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.