చెన్నూరు కాంగ్రెస్‌ అభ్యర్థి వివేక్ ఇంట్లో సోదాలపై ఈడీ ప్రకటన | Sakshi
Sakshi News home page

చెన్నూరు కాంగ్రెస్‌ అభ్యర్థి వివేక్ ఇంట్లో సోదాలపై ఈడీ ప్రకటన.. 200 కోట్ల అక్రమ లావాదేవీలు?

Published Wed, Nov 22 2023 8:41 PM

ED Statement On Raids At Chennur Congress Candidate Vivek - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ఎంపీ, కాంగ్రెస్ చెన్నూరు నియోజకవర్గ  అభ్యర్థి వివేక్ ఇంట్లో సోదాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. మొత్తం రూ. 200 కోట్ల అక్రమ లావాదేవీలను జరిపినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. యాశ్వంత్ రియాలిటీతో పాటు గడ్డం వివేక్ భార్య పేరిట కూడా భారీగా అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు ఫెమా చట్టం కింద మాజీ ఎంపీ వివేక్‌పై కేసు నమోదు చేశారు.

విజిలెన్స్ సెక్యూరిటీ ద్వారా ఎలాంటి వ్యాపారం లేకపోయినా పెద్దఎత్తున లావాదేవీలు జరిగినట్లు అధికారులు తెలిపారు. నకిలీ పత్రాలతో ఆస్తులను కొనుగోలు.. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో ఇప్పటి వరకూ 20 లక్షల ఆదాయపు పన్ను మాత్రమే చెల్లించినట్లు పేర్కొన్నారు. కాగా డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్  తెలంగాణలోని నాలుగు ప్రదేశాలలో ఫారిన్ ఎక్స్ఛెంజ్‌ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) నిబంధనల ప్రకారం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. 

హైదరాబాద్‌లోని డాక్టర్ గడ్డం వివేకానంద నివాసంతోపాటు హైదరాబాద్‌లోని విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్, విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరిగాయి. రామగుండంలో లిమిటెడ్. హైటెక్ సిటీ, మంచిర్యాలలో ఆయన నివాసం ఉంటున్న తాత్కాలిక స్థలంలో కూడా సోదాలు నిర్వహించారు. తెలంగాణ పోలీసుల సూచన మేరకు ఈడీ దర్యాప్తు ప్రారంభించి రూ. 8 కోట్లు డాక్టర్ జి. వివేక్ బ్యాంక్ ఖాతా నుండి M/s విజిలెన్స్ సెక్యూరిటీకి RTGS చేశారు

ఈడీ దర్యాప్తులో విజిలెన్స్ సెక్యూరిటీ బ్యాంక్ ఖాతా నుంచి హేతుబద్ధత లేకుండా డబ్బును సర్క్యుటస్‌గా బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. వివేక్, అతని భార్య వారి సంస్థ విశాఖ ఇండస్ట్రీస్‌లో విజిలెన్స్ సెక్యూరిటీతో 100 కోట్లు పెట్టబడి పెట్టినట్లు, విజిలెన్స్ సెక్యూరిటీపై వివేక్‌కు పరోక్ష నియంత్రణ ఉన్నట్లు వెల్లడైంది. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా FEMA ఉల్లంఘనలు, పన్ను ఎగవేతలు  జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. లెక్కలోని  అనేక కోట్ల  లావాదేవీలు గుర్తించారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement