Durgam Cheruvu Cable Bridge Closed: Traffic Advisory For 3 Days In Hyderabad - Sakshi
Sakshi News home page

Durgam Cheruvu Cable Bridge: ట్రాఫిక్‌ పోలీసుల ఆంక్షలు.. రాకపోకలు బంద్‌

Published Wed, Apr 5 2023 12:26 PM

Durgam Cheruvu Cable Bridge To Be Closed from April 6 10 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై మూడు రోజులపాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.  ఈ నెల 6వ తేదీ అర్థరాత్రి నుంచి 10వ తేదీ ఉదయం వరకు కేబుల్‌ బ్రిడ్జి మూసివేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్‌ తెలిపారు. కేబుల్‌ బ్రిడ్జి నిర్వహణ మ్యానువల్‌ ప్రకారం కాలనుగుణంగా ఇంజినీర్లచే తనిఖీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో భారీ బరువున్న క్రేన్లను కేబుల్‌ బ్రిడ్జిపై ఉంచాల్సి రావడంతో ట్రాఫిక్‌ను మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. నాలుగు రోజులపాటు వాహనదారులు, పాదాచారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్ళాలని కమిషనర్‌ సూచించారు.

మరోవైపు రాకపోకలు నిలిచిపోయే ఆ నాలుగు రోజులపాటు ట్రాఫిక్‌ను వివిధ మార్గాల్లో మళ్లించనున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. రోడ్‌ నం.45 నుంచి కేబుల్‌ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను రెండు మార్గాల్లో మళ్లించనున్నారు. అలాగే ఐకియా రోటరీ నుంచి కేబుల్‌ బ్రిడ్జి మీదుగా జూబ్లీహిల్స్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సైతం రెండు మార్గాల్లో మళ్లించనున్నారు. ఈ విషయాన్ని గమనించి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లి సహకరించాలని ట్రాఫిక్‌ పోలీసులు కోరారు.
చదవండి: Alert: హనుమాన్‌ శోభాయాత్ర.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

Advertisement

తప్పక చదవండి

Advertisement