ఎంఆర్సీఓజీ అర్హత సాధించిన డా. సైకం శ్రీలత నాయుడు | Dr Saikam Srilatha Naidu Qualifies For MRCOG | Sakshi
Sakshi News home page

ఎంఆర్సీఓజీ అర్హత సాధించిన డా. సైకం శ్రీలత నాయుడు

Jun 13 2026 2:31 PM | Updated on Jun 13 2026 3:07 PM

Dr Saikam Srilatha Naidu Qualifies For MRCOG

నల్గొండ: ప్రసూతి, స్త్రీరోగ వైద్య నిపుణురాలు డాక్ట‌ర్‌ సైకం శ్రీలత నాయుడు ప్రతిష్ఠాత్మక ఎం.ఆర్.సి.ఓ.జి. (MRCOG) అర్హతను సాధించారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఒబ్‌స్టిట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (RCOG) అందించే ఈ అంతర్జాతీయ గుర్తింపు పొందిన అర్హతను ఆమె విజయవంతంగా పూర్తి చేశారు.

డాక్ట‌ర్‌ శ్రీలత నాయుడు గత పదేళ్లుగా నల్గొండలో ప్రసూతి, స్త్రీరోగ వైద్య సేవలతో పాటు వంధ్యత్వ చికిత్సలు, లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సల రంగంలో విశేష సేవలు అందిస్తున్నారు. వైద్య వృత్తిలో నిరంతర అధ్యయనం, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఈ ఘనతను సాధించినట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి.

ఎంఆర్సీఓజీ అర్హత సాధించడం ద్వారా శ్రీలత నాయుడు అంతర్జాతీయ ప్రమాణాల వైద్య నైపుణ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారని సహచర వైద్యులు అభినందించారు. ఈ విజయం ఆమె వ్యక్తిగత ప్రగతికే కాకుండా నల్గొండ జిల్లా వైద్య రంగానికి, తెలుగు రాష్ట్రాల మహిళా ఆరోగ్య సేవలకు గర్వకారణమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సైకం శ్రీలత నాయుడుకు పలువురు వైద్యులు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement