
కరీంనగర్ జిల్లా: కాంగ్రెస్ కార్యకర్తనైనప్పటికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదంటూ కరీంనగర్ జిల్లా సుందరగిరిలో దంపతులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వంతడ్పుల శ్రీనివాస్, సృజన దంపతులు కరీంనగర్‌లో అద్దెకుంటున్నారు. సుందరగిరిలో వీరికి సొంత ఇల్లు లేదు. ఇందిరమ్మ ఇల్లు కోసం మేలో గ్రామ కమిటీ సభ్యులను శ్రీనివాస్ నిలదీసినా మంజూరు కాలేదు.
ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ తన కోటా నుంచి సుందరగిరికి మరో 20 ఇళ్లు మంజూరు చేశారు. జాబితాలో శ్రీనివాస్ పేరు లేదు. దీంతో దంపతులు మంగళవారం సుందరగిరిలోని హుస్నాబాద్–కరీంనగర్ ప్రధా న రహదారిపై బైఠాయించారు. శ్రీనివాస్ భార్యపై పెట్రోల్ పోసి.. తన ఒంటిపై, నోట్లో కూడా పోసుకున్నాడు. పోలీసులు వెంటనే వచ్చి వారిని 108లో హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.