రాగితో మాస్కు.. 99.9 శాతం బ్యాక్టీరియా నాశనం.. మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు

Copper Mask To Protect Against Coronavirus - Sakshi

బ్యాక్టీరియా, వైరస్‌లు 99.9 శాతం నాశనం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడికి మాస్కు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి దాదాపు అన్ని చోట్లా ‘మాస్క్‌ తప్పనిసరి’ చేశారు. అయితే కరోనాతో పాటు అన్ని బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించే మాసు్కలు వచ్చేస్తే! ఇలాంటి మాసు్కనే ఇంటర్నేషనల్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ పౌడర్‌ మెటలర్జీ (ఏఆర్‌సీఐ), సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కలిసికట్టుగా తయారు చేశారు. రాగిని నానో స్థాయిలో వాడి రూపొందించిన ఈ కొత్త రకం మాసు్కను బెంగళూరుకు చెందిన రెసిల్‌ కెమికల్స్‌ మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. 

20 నానోమీటర్ల సైజున్న రాగి కణాలతో..
బ్యాక్టీరియా, వైరస్‌లను అడ్డుకోగల మాసు్కలు ఇప్పటికే మార్కెట్‌లో ఉన్నా వాటి ఖరీదు ఎక్కువ. అందుకే ఏఆర్‌సీఐ, సీసీఎంబీ శాస్త్రవేత్తలు చౌకైన యాంటీవైరల్‌ మాస్కు తయారీకి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ చేపట్టిన నానో మిషన్‌లో భాగంగా 20 నానోమీటర్ల సైజున్న రాగి కణాలను తాము తయారు చేశామని, వస్త్రంపై ఈ కణాలతో కూడిన పూత పూయడం ద్వారా 99.9 శాతంతో బ్యాక్టీరియాను నాశనం చేయగలిగామని ఏఆర్‌సీఐ శాస్త్రవేత్త ఎన్‌. తాతారావు తెలిపారు.

అలాగే సీసీఎంబీ శాస్త్రవేత్తల ప్రయోగాల్లో వైరస్‌ 99.9 శాతం నశించినట్టు గుర్తించారు. నానో కణాల పూత ఉన్న మాస్కు ఒక్క పొరతో ఉన్నా ప్రభావం బాగా కనబడింది. ప్రస్తుతం రెండు పొరలున్న మాసు్కను రెసిల్‌ సంస్థ పెద్ద ఎత్తున తయారు చేస్తోంది. ఈ మాసు్కలను త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. వీటిని సాధారణ మాసు్కల్లా శుభ్రం చేసుకుని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు కూడా.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top