Welfare: ఈ మందులకు డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ అవసరం లేదు

Central Department Of Health Family Welfare Reveals 16 Tablets - Sakshi

16 మందులను వెల్లడించిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ  

సాక్షి, హైదరాబాద్‌:  డాక్టర్‌ మందుల చీటీ (ప్రిస్కిప్షన్‌) లేకుండా 16 రకాల మందులను ఔషధ దుకాణదారులు విక్రయించవచ్చని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. లైసెన్స్‌ ఉన్న దుకాణదారులే వీటిని విక్రయించాలని స్పష్టం చేసింది. రోగి సమాచారాన్ని తీసుకొని మందులు ఇవ్వాలని పేర్కొంది. ఆయా మందులను ఐదు రోజుల వరకే వాడాలని, అప్పటికీ తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించాలని రోగులకు విజ్ఞప్తి చేసింది.  

ప్రిస్క్రిప్షన్‌ అవసరం లేని మందుల జాబితా 
1) పొవిడోన్‌ అయోడిన్‌ – యాంటీ సెప్టిక్‌; 2) క్లోరోహెక్సిడైన్‌ గ్లుకోనేట్‌– మౌత్‌ వాష్‌; 3) క్లోట్రిమాజోల్‌ క్రీం (యాంటీ ఫంగల్‌); 4) క్లోట్రిమాజోల్‌ డస్టింగ్‌ పౌడర్‌(యాంటీ ఫంగల్‌); 5) డెక్స్‌ట్రోమితార్పన్‌ హైడ్రోబ్రోమైడ్‌ లొంజెస్‌– 5 ఎంజీ (దగ్గు తగ్గేందుకు); 6) డైక్లోఫినాక్‌ క్రీమ్‌/ఆయింట్‌మెంట్‌/జెల్‌ (నొప్పి తగ్గించేందుకు); 7) డైఫెన్‌హైడ్రామైన్‌ కాప్సూ్యల్స్‌–25 ఎంజీ (యాంటీ అలెర్జిక్‌); 8) పారాసిటమాల్‌–500 ఎంజీ మాత్రలు; 9) సోడియం క్లోరైడ్‌ నాజల్‌ స్ప్రే (ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం); 10) ఆక్సిమెటాజోలైన్‌ నాజల్‌ సొల్యూషన్‌ (ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం); 11) కీటొకోనాజోల్‌ షాంపూ (చుండ్రు నివారణ); 12) లాక్టులోస్‌ సొల్యూషన్‌ 10 గ్రా/15 ఎంల్‌ (మలబద్దక నివారణ); 13) బెంజోల్‌ పెరాక్సైడ్‌ (మొటిమల నివారణ); 14) కాలమైన్‌ లోషన్‌ (యాంటీ సెప్టిక్‌); 15) జైలోమిటాజోలైన్‌ హైడ్రోక్లోరైడ్‌ (ముక్కు దిబ్బడ తగ్గించేందుకు); 16) బిసాకొడిల్‌–5 ఎంజీ మాత్రలు (మలబద్దక నివారణ) 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top