హెచ్‌సీయూలో ఉద్రిక్తత.. మోదీ బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనతో టెన్షన్‌

ABVP And SFI Leaders Clash Over Modi BBC Documentary At HCU - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. హెచ్‌సీయూలో ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన  బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన వల్ల ఏబీవీపీ-ఎస్‌ఎఫ్‌ఐ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో, పోలీసులు వారిని ఎంట్రీ ఇచ్చారు. 

వివరాల ప్రకారం.. హెచ్‌సీయూలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్యాంపస్‌లో గురువారం సాయంత్రం కశ్మీర్‌ ఫైల్స్‌ను ప్రదర్శించేందుకు ఏబీవీపీ ప్రయత్నించింది. ఈ సందర్భంగా మోదీ బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ప్రయత్నించారు. దీంతో, ఇరు వర్గాల విద్యార్థి సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో క్యాంపస్‌లో ఎలాంటి ప్రదర్శనలకు అనుమతిలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన కారణంగా హెచ్‌సీయూలో పోలీసులు భారీగా పోలీసులు మోహరించారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top