చాకలి ఐలమ్మ జయంత్యుత్సవాలకు రూ.15 లక్షలు | 15 Lakhs for Chakali Ilamma Jayanthi Celebration: Ponnam Prabhakar | Sakshi
Sakshi News home page

చాకలి ఐలమ్మ జయంత్యుత్సవాలకు రూ.15 లక్షలు

Sep 7 2024 4:51 AM | Updated on Sep 7 2024 4:51 AM

15 Lakhs for  Chakali Ilamma Jayanthi Celebration: Ponnam Prabhakar

రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమకారిణి చాకలి ఐలమ్మ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షల నిధులు కేటాయించిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఈ ఉత్స వాలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఐలమ్మ జయంత్యుత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించా రు. ఈనెల 26న రవీంద్ర భారతిలో జరిగే జయంతి కార్యక్రమాల కోసం రూ.12 లక్షలు కేటాయించామని, అలాగే ఈ నెల 10న జరిగే వర్ధంతి కార్యక్రమం కోసం రూ.3 లక్షలు కేటాయించినట్లు పొన్నం వెల్లడించారు.

ఈ కార్యక్రమాల నిర్వహణ కమిటీకి చైర్మన్‌గా షాద్‌నగర్‌ శాసనసభ్యుడు వీర్లపల్లి శంకర్‌ వ్యవహరిస్తారన్నారు. ఈ కమిటీలో 40 మంది సభ్యులను కూడా నియమించినట్లు చెప్పారు. పాలకుర్తిలో చాకలి ఐలమ్మ స్మారక భవన నిర్మాణానికి ఉన్న అనువైన స్థలాన్ని గుర్తించాలని, ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డికి మంత్రి సూచించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement