TSPSC Case: ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్‌.. న్యూజిలాండ్‌లో మరో నిందితుడు

SIT Filed Charge Sheet In TSPSC Paper Leak Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేపర్‌ లీకేజీ కేసును కేసీఆర్‌ సర్కార్‌ సీరియస్‌గా తీసుకుంది. దీంతో, దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది. కాగా, ఈ కేసులో సిట్‌ తాజాగా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. 

అయితే, సిట్‌ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ ప్రకారం.. పేపర్‌ లీకేజీ కేసులో ఇప్పటి వరకు రూ.1.63కోట్ల లావాదేవీలు జరిగాయి. పేపర్‌ లీక్‌ కేసులో ఇప్పటికి 49 మంది అరెస్ట్‌ అయ్యారు. ఈ వ్యవహారంలో 16 మంది మధ్యవర్తులుగా వ్యవహరించారు. మరో నిందితుడు ప్రశాంత్‌ రెడ్డి న్యూజిలాండ్‌లో ఉన్నాడు. ఎనిమిది మంది అభ్యర్థులకు డీఏఓ పేపర్‌ లీకైంది. ఏఈ పేపర్‌ 13 మందికి, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌ నలుగురికి లీకైంది. ఏఈఈ పేపర్‌ ఏడుగురు అభ్యర్థులకు లీకైంది. ఏఈఈ పరీక్షలో మరో ముగ్గురు మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్స్‌, ఇతర పరికరాలను రామాంతపూర్‌లోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబోరేటరీకి పంపించామని సిట్‌ పేర్కొంది.

ఇది కూడా చదవండి: బీజేపీ బిగ్‌ ప్లాన్‌.. ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు!  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top