
సాక్షి, జగిత్యాల జిల్లా: జగిత్యాల రూరల్ మండలం హబ్సీపూర్ గ్రామంలోని బెల్ట్‌షాపు నిర్వాహకుడు మద్యం పోయడం లేదని ఓ వ్యక్తి మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
హబ్సీపూర్ గ్రామానికి చెందిన చిరంజీవి మంగళవారం ఉదయం గ్రామంలోని రవికి చెందిన బెల్ట్‌షాపులోకి వెళ్లాడు. తనకు 90 ఎం.ఎల్.మద్యం పోయాలని కోరగా.. అందుకు నిర్వాహకుడు నిరాకరించాడు. అయితే, తనను కులం పేరుతో తిట్టడమే కాక తనకు మద్యం పోయకుండా అవమానించాడని బాధితుడు రాత్రి పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. చిరంజీవి ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేస్తున్నారు.