తిరువళ్లూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన బాలసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆణి నెల మొదటి మంగళవారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. తిరువళ్లూరు జిల్లా శిరువాపురిలో బాలసుబ్రమణ్యస్వామి ఆలయంలో ఆరువారాలపాటు మంగళవారం ఆలయానికి వచ్చినెయ్యి దీపం వెలిగించి మొక్కులు చెల్లిస్తారు. ఇందులో భాగంగా ఆణిమాసం మొదటి మంగళవారం కావడంతో ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి 16 రకాల వస్తువులతో స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. స్వామి వారి దర్శనం కోసం 3గంటలపాటు భక్తులు క్యూలో వేచి వుండి స్వామివారిని దర్శించుకున్నారు.


