సంతానోత్పత్తే లక్ష్యంగా సముద్రంలోకి షార్క్స్‌ | - | Sakshi
Sakshi News home page

సంతానోత్పత్తే లక్ష్యంగా సముద్రంలోకి షార్క్స్‌

Jun 7 2026 3:51 AM | Updated on Jun 7 2026 3:51 AM

● వీజీపీ కింగ్‌ డమ్‌ కొత్త అడుగు

సాక్షి, చైన్నె: సముద్ర జీవుల సంరక్షణ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచే ఘట్టం శనివారం ఆవిష్కృత మైంది. చైన్నెలోని విజీపీ మైరెన్‌ కింగ్‌డమ్‌ తమ అక్వేరియంలో కృత్రిమ వాతావరణంలో పుట్టి పెరిగిన శ్రీబ్యాండెడ్‌ బాంబూ షార్‌క్క్‌ను రకం సొరచేపలను విజయవంతంగా సముద్రంలోకి విడుదల చేసింది. సుస్థిర సముద్ర జీవవైవిధ్య సంరక్షణ , బాధ్యతాయుతమైన ఆక్వాకల్చర్‌ దిశగా ఈ ప్రయత్నం జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి ఎ. శ్రీనాథ్‌ సమక్షంలో ఈ చారిత్రాత్మక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సముద్ర జీవశాస్త్రవేత్తలు, పర్యావరణ సంరక్షణ నిపుణులు, ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

శాసీ్త్రయ అక్వేరియం నిర్వహణకు నిదర్శనం

సముద్రంలోకి విడుదల చేసిన సొరచేపలు పూర్తిగా విజీపీ మైరెన్‌ కింగ్‌డమ్‌ సముద్ర జీవ నిపుణుల పర్యవేక్షణలో జన్మించి, పెరిగాయి. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ బ్యాండెడ్‌ బాంబూ షార్క్స్‌ను విజయవంతంగా సంతానోత్పత్తి చేసినట్లు విజీపీ మైరెన్‌ కింగ్‌డమ్‌ ప్రకటించింది. ఈసందర్భంగా మంత్రి ఎ. శ్రీనాథ్‌ మాట్లాడుతూ, ఈ వినూత్న కార్యక్రమం ఎంతో అభినందనీయమన్నారు. రాబోయే తరాలలో సముద్ర జీవుల సంరక్షణపై అవగాహన పెంచడం చాలా అవసరం అన్నారు. శాసీ్త్రయ పరిశోధనలు, ప్రజల భాగస్వామ్యంతో కూడిన ఇలాంటి బాధ్యతాయుతమైన ప్రయత్నాలు భారతదేశ సంపన్న సముద్ర వారసత్వాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. విజీపీ గ్రూప్స్‌ చైర్మన్‌ వి.జి. సంతోష్‌ మాట్లాడుతూ, విజీపీ కుటుంబంలో సీనియర్‌ సభ్యుడిగా, సమాజానికి, సముద్ర సంరక్షణకు ఉపయోగపడే ఇంతటి గొప్ప ప్రాజెక్ట్‌ను విజీపీ మైరెన్‌ కింగ్‌డమ్‌ విజయవంతం చేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నదన్నారు. భావితరాలకు పర్యావరణంపై అవగాహన కల్పించేలా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోవిజీపీ మైరెన్‌ కింగ్‌డమ్‌ ఎండీ వి.జి.పి. రవిదాస్‌, డైరెక్టర్‌ వి.జి.పి.ఆర్‌. ప్రేమ్‌దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement