విజయవంతంగా రోబోటిక్‌ హార్ట్‌ సర్జరీ | - | Sakshi
Sakshi News home page

విజయవంతంగా రోబోటిక్‌ హార్ట్‌ సర్జరీ

Jun 7 2026 3:51 AM | Updated on Jun 7 2026 3:51 AM

సాక్షి, చైన్నె: వైద్య సంరక్షణ రంగాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేలా, సరిహద్దులతో సంబంధం లేకుండా వైద్య సేవలు అందించే రోబోటిక్‌ అసిస్టెడ్‌ కార్డియాక్‌ టెలిసర్జరీ (రోబోట్‌ సహాయంతో సుదూర ప్రాంతం నుండి చేసే గుండె ఆపరేషన్‌)ను వైద్యులు విజయవంతం చేశారు. పూర్తిగా భారతదేశంలోనే తయారైన ఐ మంత్ర సర్జికల్‌ రోబోటిక్‌ సిస్టమ్‌ ద్వారా కేవలం 4 గంటల 50 నిమిషాలలో ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా ముగించారు. రోబోటిక్‌ కార్డియాక్‌ సర్జన్‌ డాక్టర్‌ సుధీర్‌ శ్రీవాస్తవ గయానా రాజధాని జార్జ్‌టౌన్‌లోని పబ్లిక్‌ హాస్పిటల్‌ లో ఏర్పాటు చేసిన ఐ మంత్రాసన టెలి–సర్జన్‌ కన్సోల్‌’ (కూర్చుని ఆపరేట్‌ చేసే కమాండ్‌ సిస్టమ్‌)లో కూర్చుని శస్త్రచికిత్సను విజయవంతం చేశారని శనివారం స్థానికంగా ఆ సంస్థ వివరాలను ప్రకటించింది. అలాగే, గయానా నుండి డాక్టర్‌ సుధీర్‌ తన చేతులతో చేసిన కదలికలను ఇండోర్‌లోని రోబోటిక్‌ చేతులు అత్యంత ఖచ్చితత్వంతో అనుకరిస్తూ రోగికి గుండె ఆపరేషన్‌ చేశాయని వివరించారు. ఈ శస్త్రచికిత్సకు మణిపాల్‌ హాస్పిటల్స్‌ చీఫ్‌ కార్డియాక్‌ సర్జన్‌ డాక్టర్‌ లలిత్‌ మాలిక్‌, భండారీ హాస్పిటల్‌ కన్సల్టెంట్‌ కార్డియాక్‌ సర్జన్‌ డాక్టర్‌ రామ్‌ శుక్లా, ఐఆర్‌సీఏడీ ఇండియా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ మోహిత్‌ భండారీ నేతృత్వంలోని బృందం సాయం చేసినట్టు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement