సాక్షి,చైన్నె: ప్రభుత్వ రంగ సంస్థ తమిళనాడు న్యూస్‌ప్రింట్ అండ్ పేపర్స్ లిమిటెడ్ 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. ఈ ఏడాది కంపెనీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, గతేడాదితో పోలిస్తే లాభాల్లో భారీ వృద్ధిని నమోదు చేసింది. ఈ మేరకు వివరాలను న్యూస్ ప్రిండ్‌అండ్ పేపర్స్ ౖచైర్మన్, ఎండీ సందీప్ సక్సేనా వివరించారు. మొత్తం ఆదాయం: గతేడాది రూ. 4588.31 కోట్లుగా ఉన్న ఆదాయం, ఈ ఏడాది రూ. 4720.77 కోట్లకు పెరిగిందన్నారు. గతేడాది కేవలం రూ. 3.73 కోట్లుగా ఉన్న నికర లాభం, ఈసారి ఏకంగా రూ. 247.75 కోట్లకు చేరింది.కంపెనీ తన వాటాదారులకు ప్రతి షేరుపై రూ. 4.00 (40%) డివిడెండ్‌ను ప్రకటించామని వివరించారు. ఈ ఏడాది లాభాల్లో ఇంత పెద్ద మార్పు రావడానికి ఆదాయపు పన్ను చట్టంలోని కొత్త నిబంధనలే ప్రధాన కారణంగా వివరించారు. 2026 ఫైనాన్స్ యాక్ట్ ప్రకారం కంపెనీ ‘కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుందన్నారు. దీనివలన్ల రూ. 219.43 కోట్ల మేర డెఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీ వెనక్కి రావడంతో లాభాల గ్రాఫ్ అమాంతం పెరిగిందన్నారు. పేపర్ ఉత్పత్తి 4,34,294 మెట్రిక్ టన్నులుగా,బోర్డు ఉత్పత్తి 2,00,075 మెట్రిక్ టన్నులుగా ఉన్నట్టు వివరించారు. ఆసియా దేశాల నుండి తక్కువ ధరకే పేపర్ దిగుమతులు అవుతుండటం వలన మార్కెట్లో గట్టి పోటీ నెలకొందని పేర్కొన్నారు.


