మహిళా శక్తి మా వెంటే..!
న్యూస్‌రీల్
రాష్ట్రంలోని మహిళా శక్తి డీఎంకే వెన్నంటే
ఉందని, 2026 ఎన్నికలలో ఈ శక్తి మద్దతుతోనే మళ్లీ అధికార పగ్గాలు చేపట్టి తీరుతామని ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ ధీమా వ్యక్తంచేశారు. తిరుప్పూర్ జిల్లా పల్లడంలో సోమవారం సాయంత్రం తమిళ మహిళలు వర్దిల్లాలి నినాదంతో
డీఎంకే మహిళా విభాగం మహానాడు భారీ స్థాయిలో జరిగింది.
సాక్షి, చైన్నె: తిరుప్పూర్ జిల్లా కేంద్రంగా డీఎంకే మహిళా కార్యకర్తలు కదం తొక్కారు. మహానాడు సందర్భంగా చైన్నె నుంచి ఉదయం కోయంబత్తూరుకు చేరుకున్న స్టాలిన్‌కు మహిళా లోకం బ్రహ్మరథం పట్టారు. సాయంత్రం పల్లడం నుంచి మహానాడు వేదిక వరకు బ్రహ్మాండ మోటారు సైకిల్‌ర్యాలీ జరిగింది. వందలాది మంది మహిళలు, యువతులు తమ మోటారు సైకిళ్లపై ముందుకు సాగగా, వెనుక స్టాలిన్ కాన్వాయ్ దారి పొడవున ఉన్న ప్రజల్ని పలకరిస్తూ కదిలింది. సుమారు అర్ధగంట పాటూ సాగిన ఈ ర్యాలీతో వేదిక వద్దకు స్టాలిన్ రాగానే, మహిళలందరూ లేచి నిలబడి ఆయనకు బ్రహ్మరథం పట్టే విధంగా ఆహ్వానాన్ని పలికారు. డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి,ఎంపీ కనిమొళి నేతృత్వంలో జరిగిన ఈ మహానాడుకు లక్షన్నర మంది మహిళా లోకం తరలి రావడం విశేషం. పార్టీ ఎంపీలు టీఆర్‌బాలు, రాజ తదితరులు, నెహ్రు తదితర మంత్రులు, కొంగు మండలం ఇన్‌చార్జ్, ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీలు ఈ మహానాడుకు హాజరయ్యారు.
వ్యూహాలు సిద్ధం..
ఈ మహానాడులో యువజన ప్రధాన కార్యదర్శి , డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ మాట్లాడుతూ, బీహార్‌లో విజయం సాధించాం, ఇక,తమిళనాడు టార్గెట్ అని కేంద్ర మంత్రి అమిత్‌షా వ్యాఖ్యలు చేయడాన్ని గుర్తు చేస్తూ, ఎంత మంది కొత్త,పాత బానిసలతో వచ్చినా తిప్పికొట్టే వ్యూహాలు తమ నేత వద్ద ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరికి తలొగ్గని, భయ పడని సీఎం తమిళనాడులో ఉన్నారన్న విషయాన్ని ఓ మారు ఢిల్లీ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తమిళనాడు ప్రజలకు రక్షణగా ద్రావిడ మోడల్ ఉందని, దొడ్డి దారిన పాసిస్టులు ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే, మహిళా శక్తి మద్దతుతో తరిమికొట్టే వ్యూహాలు సైతం తమ నేత వద్ద ఉందని ధీమా వ్యక్తం చేశారు.
ఆసక్తికరంగా
మహానాడు నిమిత్తం డీఎంకే ఎంపీలు కనిమొళి, తమిళచ్చి తంగపాండియన్, తదితరులు విమానంలో బయలు దేరివెళ్లారు. మహిళా నేతలందరూ కోయంబత్తూరు బయలు దేరి విమానంలోనే మాజీ గవర్నర్ తమిళి సై కూడా పర్యటించారు. దీంతో ఆసక్తికరంగా పరిణామం మారింది. అందరూ పలకరించుకున్నారు. ఆనందంగా అందరూ కలిసి పోటో సైతం దిగడం విశేషం.
మళ్లీ అధికారం చేజిక్కించుకుంటాం..
సీఎం స్టాలిన్ మాట్లాడుతూ మహిళాభ్యున్నతే లక్ష్యంగా అమలు చేస్తున్న పథకాలను గుర్తు చేశారు. తమిళనాడులో పాదం మోపేందుకు బానిసలతో కలిసి బీజేపీ చేస్తున్న కుట్రలను గుర్తు చేస్తూ, వీటన్నింటిని ప్రజా బలంతో అడ్డుకుని తీరుతామన్నారు. మహిళా లోకం ఆలోచించాల్సిన సమయం ఇదేనని, ఏ మేరకు అభ్యున్నతి సాధించారో అన్నది గుర్తెరగాలని సూచించారు. ఇక్కడున్న మహిళా శక్తి బలం తనలో మరింత ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఇదే శక్తి మద్దతుతో 2026 ఎన్నికలలో అఽధికార పగ్గాలు చేపట్టి తీరుతామని, ద్రావిడ మోడల్ 2.ఓ ప్రభుత్వం షురూ అని ధీమా వ్యక్తం చేశారు. 2.ఓ ప్రభుత్వం మహిళల కోసమే..ఈ ప్రభుత్వంలో మహిళలు మరింతగా ఉన్నత స్థితికి చేర్చే కార్యచరణల ప్రణాళిక సిద్ధంగా ఉందని ప్రకటించారు. స్థానిక సంస్థలలో వలే అసెంబ్లీ, పార్లమెంట్‌లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ డీఎంకే లక్ష్యం అని స్పష్టం చేశారు. మహిళలకు అధికారం అప్పగించడం బీజేపీకి ఇష్టంలేదని ద్వజమెత్తారు. కమలాలయం విడుదల చేసే ప్రకటనలను తన లెటర్ ప్యాడ్ ద్వారా ప్రతిపక్ష నేత పళణిస్వామి విడుదల చేస్తున్నారని మండి పడ్డారు.
మహిళా శక్తి మా వెంటే..!
మహిళా శక్తి మా వెంటే..!


