టీవీకేలో కొత్త విభాగాధిపతులు | - | Sakshi
Sakshi News home page

టీవీకేలో కొత్త విభాగాధిపతులు

Nov 4 2025 7:14 AM | Updated on Nov 4 2025 7:14 AM

టీవీకేలో  కొత్త విభాగాధిపతులు

టీవీకేలో కొత్త విభాగాధిపతులు

సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అనుబంధ విద్యార్ధి, యువజన, మహిళావిభాగాలకు కొత్త నిర్వాహకులను సోమవారం ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌ నియమించారు. ఈ మేరకు పార్టీ పరంగా ఉ న్న ప్రతి జిల్లాకూ ఓ నిర్వాహకుడు, పది మంది సహ నిర్వాహకులను నియమించారు. మొత్తంగా తమిళనాడు వ్యాప్తంగా 2,827 మందిని నియమిస్తూ ప్రకటన చేశారు.

అన్నాడీఎంకేలోనూ

కుటుంబ రాజకీయం

సెంగొట్టయ్యన్‌ విమర్శ

సాక్షి, చైన్నె : డీఎంకేలోనే కాదు, తాజాగా అన్నాడీఎంకేలోనూ కుటుంబ రాజకీయం పెరిగిందని ఆ పార్టీ బహిష్కృత నేత, ఎంపీ సెంగొట్టయ్యన్‌ వ్యాఖ్యానించారు. కోయంబత్తూరు విమానాశ్రయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, తాను ఎంజీఆర్‌ కాలం నుంచి అన్నాడీఎంకేలో కొనసాగుతూ వచ్చినట్టు గుర్తు చేశారు. పార్టీ కోసం అహర్నిషలు కృషి చేస్తూ వచ్చినట్టు పేర్కొన్నారు. ఎన్నికలలో పార్టీవిజయం సాధించాలన్న ఒకే ఒక లక్ష్యం తనది అని, ఆ దిశగా ఐక్య గళం వినిపిస్తే బయటకు పంపించే పరిస్థితులు అన్నాడీఎంకేలో ఉండటం విచారకరంగా పేర్కొన్నారు. డీఎంకేలో కుటుంబ రాజకీయాలు అని వ్యాఖ్యలు చేస్తున్నారని, అయితే, తాజాగా అన్నాడీఎంకేలోనూ కుటుంబ రాజకీయ జోక్యం పెరిగిందని ఆరోపించారు. పళణి స్వామికుమారుడు, బావమరిది, బంధువులు తాజాగా అన్నాడీఎంకే రాజకీయ జోక్యం పెరిగినట్టు ఆరోపించారు.

కొత్త ఏఐ ఫ్రేమ్‌వర్క్‌ అభివృద్ధి పరిచిన ఐఐటీ

కొరుక్కుపేట: తదుపరి తరం ఔషధాల ఆవిష్కరణకు సహాయపడటానికి ఐఐటి – మద్రాస్‌ మరో అడుగు ముందుకు వేసింది. ఐఐటీ మద్రాస్‌లోని వాధ్వానీ స్కూల్‌ ఆఫ్‌ డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (డబ్ల్యూఎస్‌ఏఐ) , అమెరికాలోని ఒహియో స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు కలిసి వాస్తవ ప్రపంచ ప్రయోగశాల సెట్టింగ్‌లలో సంశ్లేషణ చేయడానికి సులభమైన ఔషధ–వంటి అణువులను వేగంగా ఉత్పత్తి చేయగల ఒక పురోగతి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేసినట్టు సోమవారం డబ్ల్యూఎస్‌ఏఐ హెడ్‌ ప్రొఫెసర్‌ బి. రవీంద్రన్‌ తెలిపారు. ఇంకా ఆయన పేర్కొంటూ కృత్రిమ మేధస్సు ఆవిష్కరణ గురించి మనం ఎలా ఆలోచిస్తామో క్రమంగా పునర్నిర్మిస్తోందని, ఔషధ రూపకల్పన ఆ పరివర్తనకు ఒక అద్భుతమైన ఉదాహరణను అందిస్తుందన్నారు. ఔషధ ఆవిష్కరణతో పాటూ ఏఐ ఫ్రేమ్‌వర్క్‌ కొత్త పదార్థాల ఆవిష్కరణను వేగవంతం చేయడానికి ఓ ఆశాజనకమైన పునాదిని అందిస్తుందని, ఇది భవిష్యత్తులో ముఖ్యమైన పరిశోధన దిశగా మారనుందని వెల్లడించారు.

బాల్య వివాహాలను నిర్మూలించాలి

కొరుక్కుపేట: బాల్య వివాహాలను ఆపాలని ఇండియన్‌ కమ్యూనిటీ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ (ఐసీడబ్ల్యూవో) పిలుపునిచ్చాంది. ఈ మేరకు ఐసీడబ్ల్యూవో ఆధ్వర్యంలో బాల్య వివాహ రహిత భారతదేశం ప్రచారంలో భాగంగా ఎన్‌జివో , పాఠశాలలు , సంఘాలు , గ్రామాలలో అవగాహన ప్రచారాలను నిర్వహిస్తోంది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం చేస్తోం. ఈక్రమంలో చైన్నెలోని ఓ పాఠశాలలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన తీసుకుని వచ్చారు . ఇందులో ఐసిడబ్ల్యూవో సెక్రటరీ ఏజే హరిహరన్‌ మాట్లాడుతూ హిందువుల వివాహ సీజన్‌ ప్రారంభం అయిన సందర్భంగా బాల్య వివాహాలు జరగకుండా చూసుకోవడానికి జిల్లా యంత్రాంగం, జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అఽథారిటీ కఠినమైన నిఘా ఉంచాలని , బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అధిక అప్రమత్తంగా ఉండాలని కోరారు. బాల్య వివాహాల గురించి ఏదైనా సమాచారం ఉన్న ఎవరైనా వెంటనే పోలీసు హెల్త్‌ లైన్‌ (112) , ఛైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ (1098), ఐసీడబ్ల్యూవో హెల్ప్‌లైన్‌ (9087161161 ) కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement