ఎస్‌ఐఆర్‌పై ఆందోళన వద్దు
న్యూస్‌రీల్
కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టీకరణ
పూర్తి పారదర్శకంగా జాబితా రూపకల్పన
హైకోర్టుకు వివరణ
నేటి నుంచి ఇంటింటా సవరణ సర్వే
విధులలో 77 వేల మంది సిబ్బంది
కుట్రల్ని భగ్నం చేద్దామన్న సీఎం స్టాలిన్
నేటి నుంచి సర్వే
రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)కు ఎన్నికల కమిషన్ సన్నద్ధమైంది. మంగళవారం నుంచి ఇంటింటా సర్వేకు చర్యలు తీసుకున్నారు. ఎస్‌ఐఆర్‌పై ఆందోళన వద్దని హైకోర్టుకు ఓ కేసు విచారణ సమయంలో ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది. ఎ వ్వరూ ఊహించని రీతిలో ఉత్తమంగా పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
సాక్షి, చైన్నె: 2026లో అసెంబ్లీ ఎన్నికలను తమిళనాడు ఎదుర్కోబోతున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో రాష్ట్రంలోని ఓటరు జాబితాను సవరించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. ఆ మేరకు ప్రస్తుతం రాష్ట్రంలో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 68,467 పోలింగ్ కేంద్రాలున్నాయి. గత నెలాఖరులో కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ సవరణ నోటిఫికేషన్ విడుదల చేసినానంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ నేతృత్వంలోని అధికారుల బృందం కసరత్తులపై దృష్టి పెట్టింది. తమిళనాడులో చేపట్టాల్సిన పనులు, ఇతరాత్రా అంశాల గురించి ఎన్నికల అధికారులతో సమావేశాలు నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు,జిల్లాలోని ఎన్నికల అధికారులతో వీడియో కాన్పరెన్స్ సమావేశాలు జరిగాయి. అలాగే తొలుత జిల్లాలలో గుర్తింపు పొందిన రాజకీయ పక్షాలతో సమావేశాలు నిర్వహించారు. గుర్తింపు పొందిన రాష్ట్రస్థాయి నేతలతో అర్చనా పట్నాయక్ సమావేశమయ్యారు. ఈ సమావేశాలలో ఎస్‌ఐఆర్‌కు డీఎంకే కూటమి తీవ్ర వ్యతిరేకతను వ్యక్తంచేసింది.
కుట్రల్ని భగ్నం చేద్దాం..
ధర్మపురి జిల్లా పెన్నాగరంలో ఎంపీ మణి ఇంటి వివాహవేడుకలో ప్రసంగించిన సీఎం స్టాలిన్ ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా తీవ్రంగా స్పందించారు. ఆదివారం జరిగిన ఎస్‌ఐఆర్ వ్యతిరేక అఖిల పక్ష సమావేశంలో నేతలు చేసిన సూచనలను గుర్తుచేస్తూ, తీర్మానం గురించి ప్రస్తావించారు. 2026లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతున్న సమయంలో దుష్ట శక్తులు కుట్రలకు పదును పెట్టాయని ధ్వజమెత్తారు. నిజాయితీగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉండగా, నిజమైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలించే వ్యూహాలకు పదును పెట్టారని ఽమండిపడ్డారు. ఎన్నికలకు కొన్ని నెలలే ఉన్న తరుణంలో, తాజాగా సమయం కూడా ఇవ్వకుండా ఆగమేఘాలపై ఓటరు జాబితాలో పూర్తిస్థాయి సవరణ పనులు చేపట్టేందుకు సిద్ధం కావడం దొడ్డి దారిలో కేంద్రం అనుసరిస్తున్న కుట్ర కాదా? అని ప్రశ్నించారు. బిహార్‌లో చోటు చేసుకున్న పరిణామాలను గుర్తు చేస్తూ, తొలుత తమిళనాడు నుంచి గళాన్ని విప్పింది తానేనని పేర్కొన్నారు. అలాగే లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఈ కుట్ర గురించి సమగ్ర వివరాలను బయట పెట్టారని వివరించారు. సుప్రీంకోర్టులో కేసు ఉందని గుర్తుచేస్తూ, తాజాగా తమిళనాడుతో సహా పలు రాష్ట్రాలలో బిహార్ కుట్రల వ్యూహాలకు కేంద్ర పాలకులు పదును పెట్టి ఉన్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ చర్యలను ప్రతిపక్ష నేత పళణి స్వామి వ్యతిరేకించక పోవడం, ఈ వ్యవహారంలో ద్వంద్వ బాణి అనుసరించడం అనుమానాలకు బలాన్ని చేకూర్చుతున్నాయన్నారు. బీజేపీకి భయపడి ఎన్నికల కమిషన్‌ను పళణి వెనకేసుకొస్తున్నట్టుందని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, అన్నాడీఎంకేలు కలిసి కట్టుగా ఎన్నికుట్రలు చేసినా తమిళనాడులో వారి పాచికలు పారవు అని ధీమా వ్యక్తం చేశారు. విషమ పూరితంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం తమిళనాడుపై అక్కసును కక్కుతున్నారని, ద్వేష పూరిత వ్యాఖ్యలను బిహార్ ప్రచారంలో చేస్తున్నారని గుర్తుచేశారు. బిహార్ ప్రజలు తమిళనాడులో సురక్షితంగా ఉన్నారని వివరిస్తూ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ఇలాంటి ద్వేష పూరిత వ్యాఖ్యలు, ఎన్నికల కమిషన్ ద్వారా మరిన్ని కుట్రలకు ఒడి గడుతున్నారన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, వాటిని భగ్నం చేస్తామని, 2026లో ద్రావిడ మోడల్ 2. ఓ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
ఓటరు జాబితా సవరణ పేరిట ఎన్నికల కమిషన్ తాజాగా నిజమైన ఓటర్ల పేర్లును తొలగించేందుకు చేస్తున్న కుట్రల్ని భగ్నం చేద్దామని పిలుపునిచ్చారు.
మార్గదర్శకాలపై కసరత్తు
ధాన్యం సేకరణకు ఏర్పాట్లు
కోర్టులో పిటిషన్ వేస్తాం..
కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటరు సవరణ ప్రయత్నాలను అడ్డుకునే విధంగా డీఎంకే కూటమి కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. దీనికి వ్యతిరేకంగా తాము సైతం న్యాయ పోరాటానికి సన్నద్ధంగానే ఉన్నామని అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ ఇంటే సీఎం స్టాలిన్‌కు అలర్జీగా మారిందని ఎద్దేవా చేశారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ను సైతం అన్నాడీఎంకే కార్యాలయం వద్ద పొందు పరచడం గమనార్హం. ఇక కేంద్ర సహాయమంత్రి ఎల్. మురుగన్ పేర్కొంటూ, డీఎంకే అఖిల పక్షం బేటి నాటకం అని వ్యాఖ్యలు చేశారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నాటకాన్ని తెర మీదకు తెచ్చారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, మంగళవారం నుంచి జరగనున్న ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా డీఎంకే కూటమి పార్టీల తరపున సుప్రీంకోర్టులో పిటిషన్లుదాఖలు చేసినట్టు సమాచారం.
ఓటరు జాబితా ఆధారంగా ఇంటింటా సర్వే నిర్వహించేందుకు 77 వేల మంది సిబ్బందిని ఎంపిక చేశారు. వీరికి ఓటరు జాబితా సవరణకు సంబంధించిన అంశాలు, నిబంధనలు తదితర వివరాలతో ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. సవరణ కసరత్తు ముగించడంతో మంగళవారం నుంచి డిసెంబరు 4 వ తేదీ వరకు నెల రోజుల పాటూ ఇంటింటా సమగ్ర పరిశీలనకు సిద్ధమయ్యారు. 234 అసెంబ్లీ నియోజకవర్గాలలోని 68,467 పోలింగ్ కేంద్రాలలో అక్కడి బూత్ లెవల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో సమగ్ర సర్వేకు చర్యలు తీసుకున్నారు. ఒక్కో ఇంటికి మూడు సార్లు సిబ్బంది వచ్చి పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా ఇప్పటికే డీఎంకే నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమావేశం తీర్మానం చేసింది. న్యాయపోరాటానికి సన్నద్ధమయ్యే విధంగా కసరత్తు చేపట్టారు. అదే సమయంలో హైకోర్టులో దాఖలై ఉన్న ఓ కేసు విచారణ సమయంలో మంగళవారం ఎస్‌ఐఆర్ ప్రస్తావన వచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఎం శ్రీవత్సవ, న్యాయమూర్తి జి. అరుల్ మురుగన్ నేతృత్వంలోని బెంచ్ సందించిన ప్రశ్నలకు ఇందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ తరపున వివరణ సమర్పించారు. ఎస్‌ఎస్‌ఆర్, ఎస్‌ఐఆర్ మధ్య ఉన్న భేదాలను వివరించారు. ఎస్‌ఎస్‌ఆర్ కేవలం అభ్యర్థన అని, ఎస్‌ఐఆర్ పరిశీలన అని పేర్కొన్నారు. బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటా సర్వే నిర్వహించడం జరుగుతుందని వివరించారు. చివరగా ఎస్‌ఐఆర్ గురించి ఆందోళన వద్దని స్పష్టం చేశారు. ఊహించని రీతిలో ఉత్తమంగా ఈ పనులను విజయవంతం చేస్తామని, సమర్థంగా నిర్వహించి తీరుతామని స్పష్టం చేయడం గమనార్హం.
ఎస్‌ఐఆర్‌పై ఆందోళన వద్దు
ఎస్‌ఐఆర్‌పై ఆందోళన వద్దు
ఎస్‌ఐఆర్‌పై ఆందోళన వద్దు
ఎస్‌ఐఆర్‌పై ఆందోళన వద్దు


