తిరుత్తణి ఆలయంలో నూతన దంపతుల సందడి
తిరుత్తణి: తిరుత్తణి ఆలయంలో సోమవారం నూతన దంపతుల సందడి నెలకొంది. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో సోమవారం శుభముహూర్త దినం సందర్భంగా ఆలయ అనుమతితో కొండ ఆలయంలో కావడి మండపంలో 31 జతలకు వివాహం నిర్వహించారు. దీంతో వధూవరులతో పాటు వారి బందువులు, మిత్రులు వేకువజామున కొండ ఆలయానికి చేరుకున్నారు. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు శుభ ముహూర్త సమయంలో వివాహాలు నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ బంధువులు, మిత్రుల సమక్షంలో దైవ సన్నిధి సాక్షిగా మూడు ముళ్ల బృందం ద్వారా నూతన వధూవరులు దంపతులుగా ఏకమైయ్యారు. తొలిత తల్లిదండ్రులు, బందువుల ఆశీస్సులు తీసుకున్న నూతన దంపతులు తొలి దర్శనంగా వివాహం ముగియగానే స్వామివారిని దర్శించుకున్నారు. నూతన దంపతులకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే వివాహ వేడుకల్లో పాల్గొన్న వారు సైతం స్వామిని దర్శించుకునేందుకు ఆసక్తి చూపారు. సోమవారం ఉదయం నూతన వధూవరులతో కొండ ఆలయం కళకళలాడింది.
తిరుత్తణి ఆలయంలో నూతన దంపతుల సందడి


