వైభవం..కై శిక ద్వాదశి ఆస్థానం
తిరుమల: కై శిక ద్వాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఆదివారం వైభవంగా ఆస్థానం నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువ జామున 4.30 నుంచి 5.45 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత ఉగ్రశ్రీనివాసమూర్తి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. అనంతరం దేవదేవేరులను బంగారువాకిలి వద్దకు వేంచేపు చేసి శాస్త్రోక్తంగా పురాణ పఠనంతో కై శిక ద్వాదశి ఆస్థానం జరిపించారు. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ ఏడాదికోసారి కై శిక ద్వాదశి ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. భక్తులందరికీ స్వామివారి కృపా కటాక్షాలు లభించాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో తిరుమల చినజీయర్‌స్వామి, డిప్యూటీ ఈఓ లోకనాథం పాల్గొన్నారు.
ద్వాదశి ఆస్థానంలో చినజీయర్ స్వామి, టీటీడీ ఈఓ, ఎస్పీ
వైభవం..కై శిక ద్వాదశి ఆస్థానం
వైభవం..కై శిక ద్వాదశి ఆస్థానం


