అరుణాచలేశ్వరాలయంలో బలి పీఠాలకు కుంభాభిషేకం
వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల చివరలో ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు చివరి రోజు ఆలయం వెనుక వైపున ఉన్న మహాకొండ కింద భరణి దీపం, కొండపైన మహా దీపాన్ని వెలిగించనున్నారు. పది రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో స్వామివారు వివిధ వాహనాల్లో మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మాడ వీధుల్లోని ఎనిమిది దిక్కుల్లోను కాపలా దైవాలకు అష్ట దిక్క బలిపీఠం నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ బలి పీఠాలకు మహాకుంబాభిషేకం ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్ అధ్యక్షతన శివాచార్యులు వేద మంత్రాల నడుమ ఎనిమిది దిక్కుల్లోనూ పూజలు చేసి అష్టబంధన కుంబాభిషేకం వైభభవంగా నిర్వహించారు. స్వామివార్లు వాహనాల్లో మాడ వీధుల్లో వచ్చే సమయంలో ఈ బలిపీఠాలు కాపాలా కాస్తాయని నమ్మకంతో ఈ పూజలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయ శివాచార్యులు గోకుల్ గురుకుల్, వెంకట్రాజు గురుకుల్, కార్తీ, అసిస్టెంట్ కమిషనర్ సుబ్రమణి పాల్గొన్నారు.


