డెంగీతో అప్రమత్తంగా ఉండాలి
తిరువళ్లూరు: డెంగీ వేగంగా విజృంబిస్తున్న క్రమంలో ప్రజలు అప్రమతంగా వుండాలని కలెక్టర్ ప్రతాప్ గ్రామసభలో సూచించారు. తిరువళ్లూరు జిల్లా కొరట్టూరు గ్రామంలో జరిగిన ప్రత్యేక గ్రామసభలో కలెక్టర్ ప్రతాప్, పూందమల్లి ఎమ్మెల్యే కృష్ణస్వామి హాజరయ్యారు. ఈసందర్భంగా గ్రామంలోని అర్హులైన వారికి ఇంటి పట్టాలు, తాగునీటి సదుపాయం, రోడ్డు మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటుపై ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వడంతోపాటు త్వరలోనే ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తమ వంతు చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాకాలం ప్రారంభమైన క్రమంలో నీరు నిలిచి ధోమలు ఉత్పత్తి జరిగే అవకాశం ఉందన్నారు. దీంతో డెంగీ లాంటి వ్యాధులు వేగంగా విజృంభించే అవకాశం వున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. పంచాయతీ అసిస్టెంట్ డైరెక్టర్ యువరాజ్, తహసీల్దార్ ఉదయం, ఆర్‌ఐ మహేశ్వరి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ దేశింగు పాల్గొన్నారు.


