ఆకట్టుకున్న ప్రయోగ జూనియర్–2025
తిరువళ్లూరు: ప్రత్యూష ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ప్రయోగ జూనియర్–2025తో పాటు ప్రదర్శనలో వుంచిన పలు ప్రయోగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తిరువళ్లూరు జిల్లా ఆరణ్‌వాయల్‌కుప్పంలో ప్రత్యూష ఇంజినీరింగ్ తెలుగు కళాశాల వుంది. కళాశాలలో రెండు రోజుల పాటు ప్రయోగ జూనియర్–2025 పేరిట ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు. విద్యార్థులకు సైన్సు పరిశోధనలపై అవగాహన, ఆసక్తిని పెంచడంతో పాటు విద్యార్థుల్లో వున్న ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా నిర్వహించారు. ఎగ్జిబిషన్‌కు వివిధ ప్రాంతాలకు చెందిన 30 3,600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్లస్‌టూ విద్యార్థులకు నిర్వహించిన ఎగ్జిబిషన్‌లో 110 ప్రాజెక్టులను ప్రదర్శనలో వుంచారు. ఎగ్జిబిషన్‌ను ప్రయివేటు సంస్థకు చెందిన హెచ్‌ఆర్ హెడ్ ప్రార్థఽసారథి ప్రారంభించారు. అనంతరం ఉత్తమ ప్రదర్శనలకు చైన్నెకు చెందిన స్టాంజ్ టెక్నాలజీ సంస్థ డైరెక్టర్ మారియప్పన్ పళణిపాండ్యన్ బహుమతులను ప్రదానం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు.


