ఆకట్టుకున్న కళా ప్రదర్శన
సాక్షి, చైన్నె: ప్రముఖ కళాకారుడు, కళా దర్శకుడు పద్మశ్రీ తోట తరణి పెయింటింగ్‌లతో చైన్నెలో కళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఫుట్‌నోట్స్ ఆన్ సినిమా (కాహియర్స్ డు సినిమా) పేరిట చైన్నె నుంగంబాక్కంలో అలయన్స్ ఫ్రాంకై సీ ఆఫ్ మద్రాస్‌లో ఏర్పాటైన ఈ ప్రదర్శనను అలయన్స్ ఫ్రాంకై స్ ఆఫ్ మద్రాస్ అధ్యక్షుడు టి.కె. దుర్గాప్రసాద్, చెవాలియర్ డె ఐ’ఆర్డ్‌రే డెస్ ఆర్ట్స్ ఎట్ లెట్రెస్‌కి చెందిన ప్రవీణ్ కన్ననూర్ ప్రారంభించారు. కళ, సినిమా అద్భుతమైన కలయికలతో సజీవంగా నిలుస్తున్న ఈ పెయింటింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా మారి ఉన్నాయి. ఈ ప్రదర్శనను దర్శకుడు మణిరత్నం, నటుడు పసుపతి, పారిశ్రామిక వేత్త సీకే కుమారవేల్, శరవణన్, మణియన్ సెల్వన్, గుహన్, సమీర్ భరత్ రామ్‌తో పాటు చలనచిత్ర, కార్పొరేట్, కళా రంగాలకు చెందిన ఇతర ప్రముఖులు పాల్గొని పద్మశ్రీ తోటా తరణిని ప్రశంసించారు. 125 కి పైగా కళా ప్రదర్శనలు ఇక్కడ కొలుదీరాయి. తోట తరణి జ్ఞాపకాలు, సినిమా పరిశీలనలపై సన్నిహిత ప్రతిబింబాన్ని అందిస్తుంది. తన తండ్రితో పాటూ చిన్నతనంలో సినిమా సెట్‌లలో ఆయన అనుభవాల ద్వారా ఇది రూపొందించబడినట్టు తోట తరణి చెప్పకొచ్చారు. ఈ ఆర్ట్ షోలో 25 కి పైగా పెయింటింగ్‌లు ఉన్నాయి, ూగించి తయారు చేసిన ఫ్రేమ్‌లపై ప్రదర్శించబడ్డాయి. స్కెచ్ పెన్నులతో గాడా వస్త్రంపై రూపొందించబడిన స్కెచ్‌లు, సెల్యులాయిడ్ యొక్క మంత్రముగ్ధతను స్పష్టంగా జీవం పోస్తున్నాయి.
సినిమాపై పుట్‌నోట్స్...
ఈ సందర్భంగా పద్మశ్రీ తోట తరణి మాట్లాడుతూ ఆయన మాటల్లోనే, ‘సినిమాపై ఫుట్‌నోట్స్ సినిమా కళలో మునిగిపోయిన జీవితకాలాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ చిత్రాల చుట్టూ పెరిగి, సినిమా సెట్‌లలో లెక్కలేనన్ని గంటలు గడిపిన తాను ప్రతి ఫ్రేమ్, ప్రతి సంజ్ఞ కథకు ప్రాణం పోసే ప్రతి వివరాలను గమనించాను, గ్రహించాను, ప్రేరణ పొందాను. ఈ పని ద్వారా, ఆ క్షణాలను కాన్వాస్‌పైకి అనువదించాలని, భారతీయ సినిమా యొక్క సారాంశం , ఉత్సాహాన్ని సంగ్రహించాలని నేను లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ ప్రదర్శనను కెమెరామెన్, అసిస్టెంట్ డైరెక్టర్లు, సిబ్బంది, తెరవెనుక అవిశ్రాంతంగా పనిచేస్తున్న వారందరికీ అంకితం చేయడానికి నేను ప్రత్యేకంగా సంతోషిస్తున్నాను అని వ్యాఖ్యలు చేశారు. ఈనెల14 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని ప్రకటించారు.
ప్రదర్శనలో కొలువుదీరిన పెయింటింగ్స్
ఆకట్టుకున్న కళా ప్రదర్శన
ఆకట్టుకున్న కళా ప్రదర్శన
ఆకట్టుకున్న కళా ప్రదర్శన


