గిండిలో.. ఎకో పార్కు
చైన్నెలోని గిండిలో 118 ఎకరాల్లో విస్తీర్ణంలో అతిపెద్ద పర్యావరణ వ్యవస్థతో కూడిన ఎకో పార్కు ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులను శనివారం సీఎం స్టాలిన్ ప్రారంభించారు. నీటి వనరులకు మరమ్మతులు, అరుదైన చెట్ల పెంపకం, అందమైన పుష్పించే మొక్కలతో నర్సరీ పనులపై దృష్టి పెట్టారు.
సాక్షి, చైన్నె: రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ గత ఏడాది ఉద్యానవన శాఖకు గిండిలోని 118 ఎకరాల స్థలాన్ని అప్పగించింది. ఇక్కడ ఎకో–పార్క్ ఏర్పా టు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. చైన్నె నగరంలో సెంట్రల్‌భాగంలో ఉన్న గిండిలో ఎకో పార్కు ఏర్పాటుతో మహానగరాన్ని భారీ వరదల నుండి రక్షించడానికి వీలు అవుతుందని భావించి చర్యలు చేపట్టారు. ఈ మేరకు కార్పొరేషన్ ద్వారా నాలుగు చెరువులు ఇక్కడ నిర్మించబడ్డాయి. ఈ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దే విధంగా అక్కడ ఉన్న నీటి వనరుల బలోపేతం చేయడం, మొక్కలు నాటడం, నర్సరీలను ఏర్పాటు చేయడం వంటి పనులను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, మంత్రులు ఎం.ఆర్. కె. పన్నీర్ సెల్వం,ఎం. సుబ్రమణియన్, పీకే శేఖర్ బాబు, ఎమ్మెల్యేలు గణపతి, ప్రభాకర్ రాజా, అరవింద్ రమేష్ పాల్గొన్నారు.
రోడ్లు – వంతెనలు..
సచివాలయం నుంచి రహదారుల శాఖ తరపున రూ.1,248 కోట్ల వ్యయంతో నిర్మించిన 10 రోడ్లు, 2 రైల్వే క్రాసింగ్ వంతెనలను సీఎం స్టాలిన్ ప్రారంభించారు. ఈరోడ్, తిరువారూర్, మైలాడుతురై, తంజా వూరు, తిరువళ్లూరు, తిరునెల్వేలి,అరియలూరు, మదురైలలో కొత్త రోడ్లను ఏర్పాటు చేయగా, వేలూ రు లోరైల్వే క్రాసింగ్ వంతెనలను నిర్మించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ముత్తుస్వామి, ఎస్‌ఎంనాజర్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో క్రైస్తవులకు, ముస్లింలకు శ్మశాన వా టికల నిమిత్తం స్థలాన్ని కేటాయిస్తూ సీఎం చర్యలు తీసుకున్నారు. మైనారిటీల సంక్షేమ శాఖ తరపున వి రుదునగర్, తేని, రామనాథపురం, తిరువళ్లూరు, పెరంబలూరు, శివగంగైలో క్రైస్తవులకు ప్రభుత్వ ప్ర జా శ్మశానవాటికలకు స్థలాన్ని అప్పగించారు. రుదునగర్, తేని, తిరువళ్లూరు, పెరంబలూరు, శివగంగైల లో ముస్లింల కోసం ప్రభుత్వ ప్రజా శ్మశానవాటికలకు స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలాలలో ప్రహరీ గొడ నిర్మాణం, ఇతర సౌకార్యల కల్పనకు చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా సరిహద్దు పోరాటంలో అమర వీరులను స్మరిస్తూ సీఎం స్టాలిన్ ప్రకటన చేశారు. మార్షల్ నేషమణి, శిలంబు సెల్వర్ వంటి వీరులను త్యాగాలను గుర్తు చేశారు. ఇలాంటి వారి స్పూర్తితో తమిళనాడు హక్కులను కాపాడుకుందాం, పోరాడుదాం. గెలుద్దాం అని వ్యాఖ్యలు చేశారు.
మార్గదర్శకాలు..
సచివాలయంలో అధికారులతో సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి, మంత్రులు సమావేశమయ్యారు. కరూర్‌లో విజయ్ ప్రచారంలో జరిగిన పెను విషాదంను పరిగణించి రోడ్ షోలు, సభల నిర్వహనకు మార్గాదర్శకాల రూపకల్పనకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ దృష్ట్యా, మార్గదర్శకాల రూపకల్పనకు ప్రభుత్వం సిద్ధమైంది. రాజకీయ పక్షాల రోడ్ షోలు, బహిరంగ సభలు, ఇతర సభలను పరిగణించి, అనేక నిబంధనలు, ఆంక్షలతో కూడిన మార్గదర్శకాల రూపకల్పన దిశగా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
87 కొత్త అంబులెన్స్‌లు
అత్యవసర వైద్య సేవల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం అంబులెన్స్‌ల సేవలను విస్తృతం చేసింది. 108 అంబులెన్స్‌లకు మరింత బలాన్ని కలిగించే విధంగా కొత్తగా 87 వాహనాలను కొనుగోలు చేశారు. రూ. 18 కోట్ల 90 లక్షల 46 వేలతో కొనుగోలుచేసిన ఈ అంబులెన్స్‌లకు సీఎం స్టాలిన్ జెండా ఊపారు. 2008లో రాష్ట్రంలో 108 అంబులెన్స్ సేవలకు డీఎంకే ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ అంబులెన్స్‌లో 24 గంటల పాటూ సేవలను అందిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం, 1,353 అత్యవసర వాహనాలు ఉన్నాయి. ఇందులో 977 ప్రాథమిక సౌకర్యాలతో కూడినవి కాగా, మరో 307 మెరుగైన వైద్య సౌకార్యలు కలిగినవి ఉన్నాయి. 65 అంబులెన్స్‌లను గర్బిణిలు, శిశువులను తరలించేందుకు వీలుగా ప్రత్యేక సౌకార్యలను కలిగి ఉంటాయి. ఇవే కాకుండా 41 ద్విచక్ర అంబులెన్స్‌లు సేవలు అందిస్తున్నాయి. తాజాగా మరో 87 కొత్త అంబులెన్స్‌లు ’108’ అత్యవసర సేవలలో చేరాయి. అనంతరం జరిగిన కార్యక్రమంలో తమిళనాడు హౌసింగ్ బోర్డులో 36 మంది టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్), పట్టణ ప్రణాళిక డైరెక్టరేట్‌లో 24 మంది సర్వేయర్లు, అసిస్టెంట్లుగా నియమితులైన వారికి సీఎం స్టాలిన్ ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముత్తుస్వామి, సీఎస్ మురుగానందం, పట్టణాభివృద్ధి శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి కాకర్ల ఉష, తమిళనాడు హౌసింగ్‌బోర్డు చైర్మన్ పూచ్చి ఎస్ మురుగన్ తదితరులు హాజరయ్యారు.
గిండిలో.. ఎకో పార్కు


