కోవైలో రూ.500 కోట్లతో క్రికెట్‌ స్టేడియం | - | Sakshi
Sakshi News home page

కోవైలో రూ.500 కోట్లతో క్రికెట్‌ స్టేడియం

Nov 2 2025 9:06 AM | Updated on Nov 2 2025 9:06 AM

కోవైల

కోవైలో రూ.500 కోట్లతో క్రికెట్‌ స్టేడియం

– ప్రభుత్వం టెండర్లు

సాక్షి, చైన్నె: చైన్నె చేపాక్కం ఎంఏ చిదంబరం స్టేడియంకు దీటుగా కోయంబత్తూరులో భారీ క్రికెట్‌ స్టేడియంకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ. 500 కోట్లతో చేపట్టనున్న ఈ పనులకు టెండర్లు ఆహ్వానించారు. చైన్నెలోని క్రికెట్‌ స్టేడియం గురించి తెలిసిందే. రాష్ట్రంలో అతి పెద్ద క్రికెట్‌ స్టేడియం ఇది ఒక్కటే. తాజాగా క్రీడలకు ప్రాధాన్యత ఇస్తు న్న తమిళనాడు ప్రభుత్వం కోయంబత్తూరులో నూ అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్‌ స్టేడియానికి ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కోయంబత్తూరులోని ఒండిపుదూర్‌లో 20.72 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. ఇక్కడి క్రికెట్‌ స్టేడియం నిర్మాణ పనులకు అంచనా వ్యయంగా రూ.500 కోట్లు నిర్ణయించారు. ఈ పనులు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానిస్తూ, గడువును ఈనెల 24వ తేదీగా నిర్ణయించారు.

శ్రీగాంధీకి మద్దతుగా తీర్మానాలు

సాక్షి, చైన్నె : పీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీగాంధీకి మద్దతుగా పార్టీ కార్య నిర్వాహక కమిటీలో తీర్మానాలకు చర్యలు తీసుకున్నారు. 37 చోట్ల ఈ కమిటీ సమావేశాలు శనివారం నుంచి విస్తృతం చేశారు. పీఎంకే నుంచి అన్బుమణిని రాందాసు తొలగించిన విషయం తెలిసిందే. ఆయన చేతిలో ఉన్న వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని తనకుమార్తె శ్రీగాంధికి రాందాసు గత నెల అప్పగించారు. అయితే పార్టీ తనదే అంటూ అన్బుమణి ముందుకు సాగుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీకి వ్యతిరేకంగా అన్బుమణి వ్యవహరిస్తున్నారని, ఆయనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లే విధంగా కార్యనిర్వాహక కమిటీ సమావేశాలలో తీర్మానాలను గత వారం చేశారు. ఈ తీర్మానాలు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో శ్రీగాంధీకి మద్దతుగా సైతం తీర్మానాలు చేయడానికి సిద్ధమయ్యారు. శనివారం నుంచి పీఎంకే కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు 37 చోట్ల జరుగుతున్నాయి. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా శ్రీగాంధీ నియామకానికి బలం చేకూరే విధంగామద్దతు తీర్మానాలపై దృష్టి పెట్టారు.

పోలీసుశాఖలో

అధికార ప్రతినిధి పోస్టు

సాక్షి, చైన్నె: రాష్ట్ర పోలీసు శాఖలలో ప్రపథమంగా అధికార ప్రతినిఽధి, మీడియా రిలేషన్స్‌ అధికారి పోస్టుకు రూపకల్పన చేశారు. ఎస్పీ స్థాయిలో ఐపీఎస్‌ అధికారి జె. ముత్తరశి ఈ పోస్టుకు నియమితులయ్యారు. ఈ మేరకు హోం శాఖ కార్యదర్శి దీరజ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అసిస్టెంట్‌ ఐజీగా ఉన్న జేముత్తరశిని సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు, స్పోక్స్‌ పర్సన్‌, మీడియా రిలేషన్‌ ఆఫీసర్‌గా నియమించారు. అలాగే శాంతి భద్రత విభాగం చైన్నె అసిస్టెంట్‌ ఐజీగా కూడా కొనసాగుతారని ప్రకటించారు. ఇక క్రైం రికార్డుల విభాగం ఐజీ వి. జయశ్రీని హోం గార్డు విభాగానికి, టెక్నికల్‌ సర్వీసు విభాగం ఐజీ అవినాశ్‌కుమార్‌కు క్రైం రికార్డులను అదనపు బాధ్యతగా అప్పగించారు. ఆవడి ట్రాఫిక్‌ డిప్యూటీ కమిషనర్‌ సీ శంగును రెడ్‌ హిల్స్‌ డిప్యూటీ కమిషనర్‌గా, తూత్తుకుడి పోలీసు ట్రైనింగ్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ కె. మహేశ్వరిని చైన్నె పోలీసు ట్రైనింగ్‌ కళాశాలకు స్థాన చలనం కల్పించారు. ఇదిలా ఉండగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా, ఏదేని ఆరోపణలకు వివరణ ఇచ్చే రీతిలో మంచి వాక్‌ చాతుర్య కలిగిన సీనియర్‌ ఐఏఎస్‌లను అధికార ప్రతినిధులుగా ద్రావిడ మోడల్‌ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.

కరూర్‌లో టిప్పర్‌ బోల్తా

– ముగ్గురి మృతి

తిరువొత్తియూరు: కరూర్‌లో లారీ బోల్తా పడిన ప్రమాదంలో ముగ్గురు మరణించిన ఘటన తీవ్ర విషాదం కలిగించింది. వివరాలు.. కరూర్‌ జిల్లాలోని తెన్నైలె సమీపంలో ఉన్న కోడత్తూరు వద్ద ముధలికౌండన్‌పాళయం ప్రాంతంలో నిర్మాణ పనుల కోసం శనివారం తెల్లవారుజామున ఎం.శాండ్‌ లోడ్‌తో ఓ టిప్పర్‌ లారీ వచ్చింది. అక్కడ ఎం.శాండ్‌ లోడ్‌ను నింపుకొని ఆ టిప్పర్‌ లారీ కరూర్‌ వైపు బయలుదేరింది. లారీని డ్రైవర్‌ సంతన కుమార్‌ (41) నడుపుతున్నాడు. ఒడిశాకు చెందిన కూలీలు సిక్కందర్‌ కేటా (21), అజయ్‌ బంగరా (30), పల్‌ జెమ్స్‌ పర్వా (30), బిహార్‌కు చెందిన విద్యా నానప్రభాకర్‌ (48) అనే నలుగురు అందులో కూర్చొని ప్రయాణిస్తున్నారు. క్వారీ నుంచి వెళ్తున్న క్రమంలో ఓ మలుపు వద్దకు రాగానే, ఊహించని విధంగా టిప్పర్‌ లారీ రోడ్డు పక్కన బోల్తా పడింది. దీంతో కింద పడిన సిక్కందర్‌ కేటా, అజయ్‌ బంగరా, విద్యానానప్రభాకర్‌ ఎం.శాండ్‌ మట్టి కింద చిక్కుకున్నారు. సంతన కుమార్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, పొకై ్లన్‌ సహాయంతో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. ఎం.శాండ్‌ కింద చిక్కుకున్న ముగ్గురి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు.

కోవైలో రూ.500 కోట్లతో క్రికెట్‌ స్టేడియం
1
1/1

కోవైలో రూ.500 కోట్లతో క్రికెట్‌ స్టేడియం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement