తమిళనాడు
Tamilnadu
7
65 ఏళ్లు పైబడిన వారికి ఇంటికే రేషన్ సరుకుల పంపిణీ
కొరుక్కుపేట: తమిళనాడులో ముఖ్యమంత్రి మాతత్వ నవర్ పథకం ద్వారా వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటింటికీ రేషన్ వస్తువులను అందిస్తున్నారు. ఈ పథకం కింద, 70 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల ప్రయోజనం పొందుతున్నారు. వారికి అవసరమైన బియ్యం, చక్కెర, పప్పులు, పామాయిల్ మొదలైన రేషన్ వస్తువులను లబ్ధిదారుల ఇళ్లకే నేరుగా పంపిణీ చేశారు. ఇప్పుడు లబ్ధిదారుల వయో పరిమితిని 70 నుంచి 65 ఏళ్లకు సడలిస్తూ ప్రభుత్వ ఉత్తర్వు జారీ అయింది. దీని ఆధారంగా ఈ నెల 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు 65 ఏళ్లు పైబడిన వారి ఇళ్లకే రేషన్ సరుకులు అందిస్తారు. ముఖ్యమంత్రి మాతృత్వ పథకం లబ్ధిదారులైన వృద్ధులు, దివ్యాంగులు ఈ పథకాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలని అధికారులు కోరారు.
ఆదివారం శ్రీ 2 శ్రీ నవంబర్ శ్రీ 2025
247


