6 నుంచి సమతా ఇష్టి ప్రారంభం
కొరుక్కుపేట: కులమత బేధాలు లేకుండా శ్రీమన్నారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించే సమతా ఇష్టి వైభవం ఈ నెల 6న అంకురార్పణతో ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగనుంది. చైన్నె పెరంబూర్‌లోని ఎస్‌పీఆర్ సిటీ వేదికగా సమతా ఇష్టి సేవా కమిటీ, జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెట్)–చైన్నె సంయుక్తంగా నిర్వహించనున్న సాప్తాహ్నిక పంచ కుండాత్మక సమతా ఇష్టి కార్యక్రమాన్ని శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామిజీ ప్రారంభిస్తారు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు చిన జీయర్ స్వామి చేతుల మీదుగా అంకురార్పణంతో సమతా ఇష్టి ఆరంభం కానుంది. ఈ నెల 7వ తేదీన లక్ష్మీ పూజ, 8న వెంకటేశ్వర పూజ, 9న ఉదయం 10 గంటలకు రామానుజ నూట్రంధాది సామూహిక పారాయణం, మధ్యాహ్నం 2 గంటలకు వార్షిక పోటీల విజేతలకు బహుమతులు ప్రధానం ,10వ తేదీన మంత్ర దీక్ష, 12న సాయంత్రం నాలుగు గంటలకు శోభాయాత్ర ,13వ తేది ఉదయం 11 గంటలకు మహా పూర్ణాహుతి, మధ్యాహ్నం 12:30 గంటలకు శ్రీ శ్రీనివాస కళ్యాణం మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ పూజల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకోవాలని జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైన్నె అధ్యక్షులు పి. రవీంద్ర కుమార్ రెడ్డి ,నిర్వాహకులు కార్యవర్గ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో 7వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు ప్రతీ రోజు ఉదయం 9:30 గంటలకు శ్రీ సుదర్శన నృసింహ ఇష్టి, శ్రీ వైనతేయ ఇష్టి, శ్రీ హయగ్రీవ ఇష్టి, శ్రీ పరమేష్టి (శ్రీ ధన్వంతరి హోమం తో), శ్రీ విశ్వక్సేన ఇష్టి, శ్రీ లక్ష్మీ నారాయణ ఇష్టి కార్యక్రమాలుతోపాటూ ప్రతి రోజూ రామానుజర్‌కి అభిషేకాలు, పూజలు, ఇంకా సాంస్కతి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
త్రిదండి చినజీయర్ స్వామి


