డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలకాలి
వేలూరు: పట్టణంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పర్యటన సందర్భంగా కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి, ఘనంగా స్వాగతం పలకాలని డీఎంకే జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే నందకుమార్ అన్నారు. ఈనెల 4వ తేదీన డిప్యూటీ సీఎం వేలూరుకు చేరుకుని ప్రజలకు వివిధ శాఖల ద్వారా సంక్షేమ పథకాలను అందజేయనున్నారని చెప్పారు. దీంతో వేలూరులోని డీఎంకే పార్టీ కార్యాలయంలో ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నందకుమార్ మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ వేలూరు జిల్లాలో డీఎంకే నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొని, ప్రసంగించనున్నారన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లాలోని కార్యకర్తలు, యువకులు, మహిళా నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి, పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అలారగే జిల్లా సరిహద్దులోనూ కార్యకర్తలు ఎక్కడికక్కడే స్వాగతం పలికేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రత్యేక ఓటర్ల సారంశ సవరణ పథకాన్ని అమలు చేయాలని బీజేపీ ప్రభుత్వం యోచిస్తుందని నిర్వహకులు వారి రహస్య ఉద్దేశాలను ఓడించి, నిజంగా అర్హత కలిగిన ఓటర్లను చేర్చడానికి చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం సమావేశంలో పలు తీర్మానాలను సభ్యులు ఆమోదించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కార్తికేయన్, అములు, జెడ్పీ చైర్మన్ బాబు, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ సునీల్‌కుమార్, డివిజన్ కార్యదర్శులు తనికాచలం, జ్ఞానశేఖరన్, గజేంద్రన్, ఏరియా కార్యదర్శులు వన్నియరాజ, పరమశివం, లోకనాథన్ పాల్గొన్నారు.


