విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
వేలూరు: సమాజంలో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించాలని వేలూరు వీఐటీ యూనివర్శిటీ ఉపాధ్యక్షుడు శేఖర్ విశ్వనాథన్ అన్నారు. వీఐటీ యూనివర్సిటీ, ప్రిన్సిలా రియోనియన్ యూనివర్సిటీ సంయుక్తంగా ప్రవేశపెట్టిన ఎమ్మెస్సీ బయో టెక్నాలజీ, పీజీ కోర్సులను 25 మంది విద్యార్థినీ విద్యార్థులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా వారికి సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమం వేలూరు వీఐటీ యూనివర్సిటీలోని రాజాజీ భవన్‌లో నిర్వహించారు. ఇందులో వీఐటీ ఉపాధ్యక్షుడు శేఖర్ విశ్వనాథన్ ముఖ్య అతిథిగా హాజరై సర్టిఫికెట్లు అందజేసి, ప్రసంగించారు. ఈ కోర్సులు అభ్యసించే విద్యార్థినీ విద్యార్థులు బయటకు వెళ్లినప్పుడు మన సమాజం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కార మార్గం చూపాలన్నారు. వీఐటీ కార్యనిర్వహణ డైరెక్టర్ సంధ్యా పెంటారెడ్డి, మాజీ డైరెక్టర్ విజయలక్ష్మి, ప్రిన్సిలా రియోనియన్ ఆర్గనైజర్ చట్టారో గ్రీస్, ఫ్రాన్‌కో భారత ఉపదూత మేరి రూసెట్ పాల్గొన్నారు. ఇందులో ముఖ్య అతిథిగా ప్రాన్స్ దేశ పుదుచ్చేరి, చైన్నె ఉపదూత ఏటిన్ రోలాండ్ పిగ్ విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. గౌరవ అతిథులుగా కేంద్ర ప్రభుత్వ సైన్స్ విభాగం మాజీ కార్యదర్శి రామస్వామి, వీఐటీ వైస్ చాన్సలర్ కాంచన, రిజిస్టార్ జయభారతి తదితరులు పాల్గొన్నారు.


